Siraj dismisses two west indies batters in three balls మూడు బంతుల్లో రెండు వికెట్లను తీసిన సిరాజ్..

Mohammed siraj wreaks havoc with sensational double wicket over

mohammed siraj, westindies, mohammed siraj over, mohammed siraj double wicket over, mohammed siraj first over, mohammed siraj india, india vs west indies, ind vs wi, ind vs wi 3rd odi, mohammed siraj news, india vs west indies 3rd odi, cricket news, sports news, cricket, sports

Mohammed Siraj was the one who set the tone for India with two wickets in the second over of the West Indies innings. Siraj first knocked over Kyle Mayers with a delivery that shaped into the left hander and went through him to take his stumps. A dot ball followed after which Siraj trapped Shamarh Brooks LBW.

హైదరాబాద్ స్పీడ్ స్టర్ మహమ్మద్ సిరాజ్ డబుల్ వికెట్ ఓవర్..

Posted: 07/28/2022 08:28 PM IST
Mohammed siraj wreaks havoc with sensational double wicket over

వెస్టిండీస్‌తో జ‌రిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. అతిధ్యజట్టు వెస్టిండీస్ పై వారి సొంతగడ్డపైనే ఓడించి.. మూడు వన్డేలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడ‌వ వ‌న్డేలో హైదరాబాదుకు చెందిన టీమిండియా స్పీడ్ సీమర్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. విండీస్ ను అదిలోనే దెబ్బకొట్టి కోలుకోలేని విధంగా నడ్డివిరిచాడు. విండీస్ బ్యాట‌ర్ల‌ను వెంట వెంట‌నే ఔట్ చేసి పెవిలియన్ కు పంపాడు. తాను వేసిన తొలి ఓవర్ లోని మొదటి మూడు బంతుల్లో రెండు వికెట్లను సాధించడంతో పాటు విండీస్ టాప్ అర్ఢర్ ను దెబ్బతీశాడు. రెండ‌వ ఓవ‌ర్‌లో కైల్ మేయ‌ర్స్‌, షామ‌ర్ బ్రూక్స్ వికెట్ల‌ను తీసిన సిరాజ్.. తన బౌలింగ్ ధాటిని ప్రదర్శించాడు.

మూడు బంతుల వ్య‌వ‌ధిలోనే రెండు వికెట్లు తీసి విండీస్‌కు భారీ జ‌ల‌క్ ఇచ్చాడు. మూడ‌వ వ‌న్డేలో ఇండియా డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం 119 ర‌న్స్ తేడాతో నెగ్గింది. వ‌ర్షం వ‌ల్ల కుదించిన మ్యాచ్‌లో తొలుత ఇండియా 35 ఓవ‌ర్ల‌లో 257 ర‌న్స్ చేసింది. అయితే భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన విండీస్‌ను సిరాజ్‌, చాహల్‌, శార్దూల్ దెబ్బ‌తీశారు. ఇండియ‌న్ బౌలింగ్ అటాక్‌కు విండీస్ బ్యాట‌ర్లు చేతులెల్తేశారు. చాహ‌ల్ 4, సిరాజ్ రెండు, శార్దూల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. 3 బంతుల తేడాలో రెండు వికెట్లు తీసిన సిరాజ్ వీడియో ఇదే..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles