T20I Rankings: India go seven points a top ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: టాప్ ప్లేస్ లోనే టీమిండియా

India get rankings boost following t20i series triumph over australia

T20 rankings, India T20 ranking, ICC T20 rankings, Top team in T20 rankings, Team-India, ICC T20 rankings, Australia, South Africa, Top Place, seven points ahead, Sports, Cricket

India went seven points clear of England at the top of the ICC T20 rankings following their narrow series win over Australia in Hyderabad. Down 0-1 against the touring Australia, the Rohit Sharma-led India bounced back in style to level the series in Nagpur before Virat Kohli and Suryakumar Yadav’s fifties in the deciding rubber sealed a 2-1 win.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: టాప్ ప్లేస్ లోనే కొనసాగుతున్న టీమిండియా

Posted: 09/27/2022 07:59 PM IST
India get rankings boost following t20i series triumph over australia

టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు తన అగ్రస్థానాన్ని మరింత పధిలం చేసుకుంది. తాజాగా విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మ నేతృత్వంలోని జట్టు 268 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఇదివరకే ఈ స్థానంలో కొనసాగుతున్న ఈ జట్టు.. తాజా ర్యాంకింగ్స్ లో రెండవ స్థానంలోని జట్టు కన్నా ఏకంగా ఏడు పాయింట్ల అధిక్యంలో కొనసాగడం గమనార్హం.

టీమిండియా జట్టు ప్రస్తుతం 268 పాయింట్లతో కొనసాగుతుండగా, 261 పాయింట్లతో ఇంగ్లండ్‌ రెండో స్థానంలో ఉంది. ఇక సౌతాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్ లోనూ టీమిండియా విజయబావుటా ఎగురవేస్తే.. అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశం లేకపోలేదు. ఇక 258 పాయింట్లతో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ఇంగ్లండ్‌తో ఏడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ గెలిస్తే రెండో ర్యాంక్‌కు ఎగబాకే అవకాశం ఉంది. l252 పాయింట్లతో న్యూజిలాండ్‌ ఐదో స్థానంలో నిలిచింది. 250 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియా సొంతగడ్డపై ప్రపంచకప్‌నకు ముందు వెస్టిండీస్‌తో రెండు, ఇంగ్లండ్‌తో మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team-India  ICC T20 rankings  Australia  South Africa  Top Place  seven points ahead  Sports  Cricket  

Other Articles