Venkatesh Iyer gets hit on the neck during Duleep Trophy టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌‌కు తప్పిన పెను ప్రమాదం

Indian all rounder venkatesh iyer suffers serious neck injury ambulance arrives at the ground

Venkatesh Iyer, Duleep Trophy, Venkatesh Iyer injured, Duleep Trophy 2022, medium pacer bowling, Chintan Gaja, cricket news, sports news, cricket, sports

Indian all-rounder Venkatesh Iyer suffered a serious neck injury after he was hit by a wild throw during a Duleep Trophy match in Coimbatore. As Iyer collapses, an ambulance made its way to the ground and then rushed him to the hospital. Iyer, who has also been a part of India's squad for a brief period, opened his account for the Duleep Trophy 2022 against West Zone on Day 2 hitting a six to medium pacer Chintan Gaja's bowling.

టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌‌కు తప్పిన పెను ప్రమాదం

Posted: 09/17/2022 06:38 PM IST
Indian all rounder venkatesh iyer suffers serious neck injury ambulance arrives at the ground

టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను ప్రమాదం ఎదురైంది. కోయంబత్తూరు వేదికగా వెస్ట్‌జోన్ తో-సెంట్రల్ జోన్ తలపడుతున్న సమయంలో సెమీ-ఫైనల్స్ రెండోరోజు ఆట కొనసాగింది. ఈ క్రమంలో వెస్ట్ జోన్ మీడియం పేస్ బౌలర్ చింతన్ గజా వేసిన బంతితో ఖాతా తెరిచిన నేపథ్యంలో ఆయన ఈ ప్రమాదం బారిన పడ్డారు.

చింతన్ గజా వేసిన ఓవర్‌లో 27 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్ సిక్సర్ కొట్టి ఖాతా తెరిచాడు. ఆ తర్వాతి బంతి చింతన్ వద్దకు వెళ్లడంతో అతడు వికెట్ల వైపు విసిరాడు. అది కాస్తా వెంకటేశ్ మెడను బలంగా తాకింది. అంతే, అయ్యర్ అక్కడే బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలాడు. వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజయో అతడిని పరీక్షించాడు. ఎందుకైనా మంచిదని ముుందు జాగ్రత్త చర్యగా మైదానంలోకి అంబులెన్స్, స్ట్రెచర్ కూడా తెప్పించారు. ఫిజియో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మైదానం వీడిన అయ్యర్.. నొప్పి నుంచి కాస్తంత ఉపశమనం లభించిన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు.

అయితే, వ్యక్తిగత స్కోరు 14 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరాడు. అతడి స్కోరులో రెండు ఫోర్లు, సిక్సర్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ 257 పరుగులు చేసింది. సెంట్రల్ జోన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ నిన్న 130/3తో ఉంది. పృథ్వీషా సెంచరీ (104)తో నాటౌట్‌గా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles