ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద గతేడాది అక్టోబర్‌లో అతనిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పు వెల్లడించగా.. అతని మానసిక పరిస్థితి దృష్ట్యా జైలు శిక్ష విధించకుండా మెంటల్ హెల్త్ యూనిట్‌కు తరలించాలని ఆదేశించింది.
52 ఏళ్ల స్లేటర్‌ను గతేడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. తన మాజీ భార్యను వేధిస్తున్నాడని అతనిపై కేసు పెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఆమెను భయపెట్టేలా మెసేజ్‌లు, కాల్స్ చేశాడంటూ మరో అభియోగం అతనిపై మోపారు. దీనిపై బుధవారం అక్కడి వేవెర్లీ లోకల్ కోర్టు మెజిస్ట్రేట్ రాస్ హడ్సన్ తీర్పు వెల్లడించారు. స్లేటర్‌కు జైలు శిక్ష విధించకుండా మూడు వారాల పాటు మెంటల్ హాస్పిటల్లో ఉంచాలని ఆదేశించారు.
గత ఫిబ్రవరి నెల నుంచి స్లేటర్‌కు తన మానిసక స్థితి గురించి తెలిసి మందులు వాడాలని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా జడ్జి హడ్సన్ చెప్పారు. థెరపీ, కౌన్సిలింగ్‌కు అతడు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మంగళవారం స్లేటర్‌ను నిర్బంధించిన పోలీసులు.. అతన్ని చికిత్స కోసం సిడ్నీ హాస్పిటల్‌లోని మానసిక విభాగానికి తీసుకెళ్లారు. దీంతో బుధవారం స్లేటర్ కోర్టుకు రాలేకపోయాడు. స్లేటర్ ఇప్పటికే ఎన్నో మానిసక ఆరోగ్య కేంద్రాల్లో 100 రోజులు గడపటంతోపాటు ఐదుగురు సైకియాట్రిస్టులను కలిశాడు.
ఆస్ట్రేలియా తరఫున 1993-2001 మధ్య 74 టెస్టులు, 42 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత కామెంటేటర్‌గా మారాడు. అయితే గతేడాది ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్పై సోషల్ మీడియాలో తీవ్రంగా ధ్వజమెత్తడంతో సెవెన్ నెట్వర్క్ అతన్ని కామెంటేటర్ బాధ్యతల నుంచి తొలగించింది. గతేడాది కొవిడ్ కారణంగా ఇండియా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కూడా ఆస్ట్రేలియన్లను అనుమతించకపోవడంతో.. ప్రధాని మోరిసన్ చేతులకు రక్తం అంటుకుంది అంటూ స్లేటర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి... Read more
Apr 13 | ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి... Read more
Apr 13 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్... Read more
Apr 13 | ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్... Read more
Apr 05 | ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి కాస్త ఆలస్యంగా చేరిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు ముఖ్యకారణం ఆయన వివాహం జరగడమే. ఎవరితో అంటే భారత్ కు... Read more