రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి ఫార్మాట్లోనూ అదరగొడుతున్నాడు అశ్విన్. ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆఫ్ స్పిన్నర్.. అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 150 వికెట్లు తీసిన రెండో ఆఫ్ స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రజత్ పటీదార్ వికెట్ తీసి ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఆర్సీబీ ఇన్నింగ్స్ పదో ఓవర్లో బౌలింగ్కొచ్చిన అశ్విన్.. తన స్పిన్ మాయాజాలంతో యువ ఆటగాడు రజత్ పటీదార్‌ను బొల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేని రజత్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 150 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. అశ్విన్ కంటే ముందు హర్భజన్ ఈ ఘనత సాధించాడు. మొత్తంగా ఐపీఎల్లో 150 వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఆర్సీబీతో మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో అశ్విన్ రజత్ పటీదార్, సుయాష్ ప్రభు దేశాయ్, షాబాజ్ అహ్మద్ వికెట్లను పడగొట్టాడు. ఫిబ్రవరి నెలలో జరిగిన మెగా వేలంలో అశ్విన్‌ను రాజస్థాన్ రూ.కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్-బెంగళూరు మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ అద్భుత అర్దశతకంతో రాజస్థాన్‌ను ఆదుకోవడంతో మెరుగైన స్కోరు సాధించిందీ జట్టు. ఆరంభం నుంచి పొదుపుగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్(2/19), వానిండు హసరంగా(2/23), మహ్మద్ సిరాజ్(2/30) ఆకట్టుకున్నారు.
అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ 19.3 ఓవర్లలోనే 115 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి బెంగళూరు బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. వరుసగా పెవిలియన్ క్యూ కట్టడంతో రాజస్థాన్ విజయం సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో కుల్పీప్ సేన్ 4 వికెట్లతో విజృంభించగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా రాజస్థాన్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ అంతకుముందు బ్యాటింగ్ లో స్కోరుకే పరిమితం కావాల్సిన జట్టును.. రియాన్ పరాగ్ అర్ధసెంచరీతో రాణించి ఒంటి చేత్తొ గెలిపించాడు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more
Apr 13 | ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి... Read more
Apr 13 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్... Read more
Apr 13 | ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్... Read more
Apr 05 | ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి కాస్త ఆలస్యంగా చేరిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు ముఖ్యకారణం ఆయన వివాహం జరగడమే. ఎవరితో అంటే భారత్ కు... Read more