ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ యేటి సీజన్‌లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. అయినా తాను ప్రతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. శిఖర్ ధావన్ 38.3 సగటుతో 14 మ్యాచుల్లో పంజాబ్ తరపున 460 పరుగులు చేశాడు. జట్టు మొత్తం ప్లేఆఫ్స్ కు వెళ్లకపోయినా తన కుమారుడు మాత్రం ఆటలో చక్కగా రాణించాడని ఆయన తండ్రి అనుకోలేదు. పంజాబ్ జట్టు నాకౌట్ దశకు చేరకపోవడంతో ధావన్ తండ్రి సీరియస్ అయ్యాడు. ధావన్ ను చితక్కోట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ధావన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
ఆ వీడియోలో ధావన్‌ను అతని తండ్రి కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. కిందపడిన థామన్ ను తన కాలితోనూ తంతున్నట్లు కనిపించింది. ఇక ఇంట్లో ఉన్న వాళ్లు ధావన్ తండ్రిని అడ్డుకుంటున్నట్లు ఆ వీడియోలో చూపించారు. అయితే ఎప్పుడు సరదా వీడియోలు పోస్టు చేసే ధావన్ ఈసారి కూడా ఇలా తన అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. తమ జట్టు నాకౌట్ దశకు క్వాలిఫై కాలేదని తమ తండ్రి ఇలా కొడుతున్నారని తన వీడియోకు ధావన్ ఓ ట్యాగ్ పోస్టు చేశాడు. సరదగా సాగిన ఆ వీడియోకు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. మాజీ స్పిన్నర్ హర్భజన్, పంజాబ్ టీమ్ ప్లేయర్ హర్‌ప్రీత్ బ్రార్ రియాక్ట్ అయ్యారు. ఈసారి ఐపీఎల్ జాబితాలో పంజాబ్ జట్టు ఆరవ స్థానంలో ఉంది.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more