ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి.. తన సత్తాను చాటింది. బ్యాటింగ్‌లో దూబె, ఉత్తప్ప.. బౌలింగ్‌లో తీక్షణ మెరవడంతో తన 200వ ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరుపై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 217 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన ఆర్సీబీ చివరి వరకూ పోరాడినా 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు మాత్రమే చేసింది.
217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పవర్ ప్లే ముగిసేలోపే కోలుకోలేని దెబ్బ పడింది. స్కోరు 14 పరుగులకే చేరే సరికే కెప్టెన్ డుప్లెస్సి (8) ఔటయ్యాడు. స్పిన్నర్ మహీష్ తీక్షణ చెన్నైకి తొలి బ్రేక్ సాధించిపెట్టాడు. ఆ వెంటనే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (1) కూడా ఔటవడంతో ఆర్సీబీ అభిమానులు దాదాపుగా మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకున్నారు. కాసేపటికి మరో ఓపెనర్ అనూజ్ రావత్ (12) ఔటయ్యాడు. ఈ గ్యాప్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కాసేపు మెరుపులు మెరిపించాడు. అతడు 11 బంతుల్లోనే 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 26 రన్స్ చేసి ఔటయ్యాడు.
దీంతో 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది బెంగళూరు. ఇక మ్యాచ్ ముగియడానికి ఎంతోసేపు పట్టదనుకున్న సమయంలో తొలి మ్యాచ్ ఆడుతున్న సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ కలిసి కాసేపు ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేశారు. ఈ ఇద్దరూ సీఎస్కే బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 33 బంతుల్లోనే ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. ప్రభుదేశాయ్ 18 బంతుల్లో 34 రన్స్ చేసి తీక్షణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత కాసేపటికి షాబాజ్ కూడా 27 బంతుల్లో 41 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
ఉతికారేసిన దూబె, ఉతప్ప
అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లను ఊచకోత కోశారు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు రాబిన్ ఉతప్ప, శివమ్ దూబె. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 216 రన్స్ చేసింది. ఉతప్ప, దూబె కలిసి మూడో వికెట్‌కు 80 బంతుల్లోనే 165 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలోనే చెన్నై 83 రన్స్ చేయడం విశేషం. శివమ్ దూబె 46 బంతుల్లో 8 సిక్స్‌లు, 5 ఫోర్లుతో 94 రన్స్ చేశాడు. అటు ఉతప్ప కూడా కేవలం 50 బంతుల్లోనే 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఐపీఎల్లో ఇవే అత్యధిక వ్యక్తిగత స్కోర్లు కావడం విశేషం. వీళ్ల దెబ్బకు ఆర్సీబీ బౌలర్ ఆకాశ్ దీప్ 4 ఓవర్లలోనే 58 పరుగులు సమర్పించుకున్నాడు.
పది ఓవర్ల వరకూ చెన్నై స్కోరు 2 వికెట్లకు 60 పరుగులు. వీరిద్దరూ జతకలవడంతో కూడబలుకుకుని అర్సీబి బౌలర్లను ఉతికి ఆరేసినట్లు అనిపించింది. నాలుగు మ్యాచ్‌లుగా బోణీ కోసం ఎదురు చూసిన చెన్నై టీమ్‌కు ఈ గెలుపు ఉత్సాహాన్ని అందించింది. అయితే మ్యాచ్ కు మంచి ఆరంభం లభించకపోయినా..36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో వున్నా ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఉతప్ప, శివమ్ దూబె కూడా మొదట్లో వికెట్లు కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. పది ఓవర్ల తర్వాత ప్రారంభమైన బాదుడు.. ఇన్నింగ్స్ మొత్తం కొనసాగింది.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more
May 27 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. అయినా తాను ప్రతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. శిఖర్ ధావన్... Read more