ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్ జట్టు వరుసగా మూడు మ్యాచ్ లలో ఓటమిని చవిచూసి.. ప్లే-ఆఫ్ కు కూడా వెళ్తుందా లేదా.? అన్న పరిస్థితికి చేరుకుంది. క్రమంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు ఓటముల తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 23 రన్స్ తేడాతో చెన్నై గెలిచింది.
తొలుత బ్యాటర్లు శివమ్ దూబే, రాబిన్ ఊతప్పలు భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక ఫీల్డింగ్ సమయంలోనూ చెన్నై ప్లేయర్స్ కేక పుట్టించారు. అంబటి రాయుడు 16వ ఓవర్లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కుడి వైపు డైవ్ చేస్తూ వంటి చేతిలో ఆకాశ్ దీప్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టేశాడు. రవీంద్ర జడేజా ఆ ఓవర్లో బౌలింగ్ చేశాడు. గుడ్లెన్త్ బాల్‌ను షార్ట్‌గా బౌల్ చేయడంతో అది కాస్త ఆగి వచ్చింది. ఆకాశ్ దీప్ దాన్ని పుష్ చేశాడు. షార్ట్ కవర్లో ఉన్న రాయుడు.. ఫుల్ లెన్త్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకున్నాడు. ఆ క్యాచ్ వీడియో ఇదే.
One handed stunner from Rayudu #RCBvsCSK #IPL2022 #CSK #AmbatiRayudu pic.twitter.com/5yth0BcfWp
— cricket_meme_haul (@cric_meme_haul) April 12, 2022
(And get your daily news straight to your inbox)
May 27 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. అయినా తాను ప్రతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. శిఖర్ ధావన్... Read more
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more
Apr 27 | రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి... Read more
Apr 13 | ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి... Read more
Apr 13 | ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్... Read more