Kapil Dev says start schools and colleges first క్రికెట్ కన్నా ముందు విద్యాసంస్థలే తెరచుకోవాలి: కపిల్ దేవ్

Kapil dev says cricket can take a backseat start schools and colleges first

Coronavirus outbreak, COVID-19, Cricket, Indian Cricket Team, Kapil Dev, Schools, colleges, educational institutiomns, Pakistan, Pakistan Cricket Team, Shoaib Akhtar, Cricket news, sports news, Cricket, sports

Reopening of schools and colleges once COVID-19 pandemic is under control is more important for the younger generation than resumption of sport which can take a back-seat for the time being, feels Kapil Dev.

విద్యాసంస్థలకే మొదటి ప్రాధాన్యం.. ముందు అవే తెరుచుకోవాలి: కపిల్ దేవ్

Posted: 04/25/2020 09:34 PM IST
Kapil dev says cricket can take a backseat start schools and colleges first

కరోనా వైరస్‌ కారణంగా అన్ని రంగాలు స్తంభించిన నేపథ్యంలో.. క్రికెట్‌ ఆడి ఆ డబ్బులను ఇరు దేశాలు కరోనా వైరస్ నియంత్రణకు వినియోగించుకోవచ్చున్న పాకిస్థాన్ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ వాఖ్యలపై మరోమారు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. క్రికెట్ కోసం ఎప్పటికైనా తలుపులు తెరుచుకుంటాయని అయితే అంతకన్నా ముందు విద్యా సంస్థలు తెరచుకోవాలని కపిల్‌దేవ్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌ పునరుద్ధరణ గురించి కాకుండా విద్యార్థుల చదువుల గురించి ఆలోచించాలని సూచించారు.

తాజాగా ఓ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన కపిల్‌.. ‘నేను విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం క్రికెట్‌ గురించి మాట్లాడటం సమంజసం కాదు. నేనైతే విద్యార్థుల చదువుల గురించి ఆందోళన చెందుతున్నా. వాళ్లంతా మన భావితరాలు. విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నేనైతే.. ముందు విద్యాసంస్థలు తెరచుకోవాలని అనుకుంటున్నా. ఆ తర్వాత క్రికెట్‌, ఫుట్‌బాల్‌ వాటంతటవే పునఃప్రారంభం అవుతాయి’ అని అన్నారు.

ఈ సందర్భంగా కపిల్‌ మరోసారి షోయబ్‌అక్తర్‌ గురించి స్పందించారు. కరోనాపై పోరులో విరాళాల సేకరణకు భారత్‌-పాక్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ఆడాలని అక్తర్‌ సూచించిన సంగతి తెలిసిందే. ఇదివరకే  దీన్ని ఖండించిన కపిల్‌ మరోసారి తన అభిప్రాయాన్ని తేల్చిచెప్పారు. ‘అక్తర్‌ చెప్పిన విషయాన్ని భావోద్వేగంగా ఆలోచిస్తే అవుననే అంటారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లు ఆడొచ్చు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్‌లు ఆడటం ముఖ్యంకాదు. మీకు డబ్బు అవసరమైతే ముందు బార్డర్‌లో పరిస్థితులు అదుపు చేయండి.’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles