RP Singh Discloses The Best Captain Of His Life కుంబ్లే ది బెస్ట్.. ఆ విషయంలో ధొని బెస్ట్: ఆర్పీ సింగ్

Anil kumble was best captain i played under rp singh

RP singh ms dhoni friendship, RP singh t20 world cup, cricket, ms dhoni luck, RP Singh, MS Dhoni, Anil Kumble, Sourav Ganguly, Rahul Dravid, best captain RP singh, BCCI, Game Strategy, cricket news, sports news, todays cricket match, today cricket match score, cricket, sports

The 34-year-old former Indian left-arm pacer RP Singh, a present member of the Cricket Advisory Committee (CAC), has recently talked about his captains during his international career. In this talk, he also revealed the best captain of his life.

కుంబ్లే ది బెస్ట్.. ఆ విషయంలో ధొని బెస్ట్: ఆర్పీ సింగ్

Posted: 04/27/2020 06:30 PM IST
Anil kumble was best captain i played under rp singh

టీమ్‌ఇండియా మాజీ సారథి అనిల్‌కుంబ్లే తన కెరీర్లో అత్యుత్తమ కెప్టెన్‌ అని మాజీ పేసర్‌ ఆర్పీసింగ్‌ అన్నాడు. మాజీ బ్యాట్స్ మన్‌ ఆకాశ్‌ చోప్రాతో ముచ్చటించిన లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్.. తన కెరీర్లో ది బెస్ట్ కెప్టెన్ అనీల్ కుంబ్లే అని చెప్పారు. కుంబ్లే బౌలర్ల మానసిక స్థితిని బాగా అర్థం చేసుకుంటాడని తెలిపాడు. అయితే ధోని మాత్రం బౌలర్‌ మంచి లయలో కొనసాగుతున్నా  ఇతర బౌలర్లకు బంతి ఇస్తాడని చెప్పాడు. కుంబ్లే తన ఆలోచనల్ని పక్కనపెట్టమని కూడా చెప్పినట్లు ఆర్పీ చెప్పాడు. రాహుల్‌ ద్రావిడ్ అలా చేసేవాడు కాదని చెప్పాడు.

ఇక గంగూలీ సారధ్యంలో అరంగేట్రం చేసిన తాను.. తొలి ఓవర్లోనే రెండు వైడ్లు వేశానని, అయినా నాటి కెప్టెన్ గంగూలీ ఏమనలేదని గుర్తు చేసుకున్నాడు. ‘ప్రతీ కెప్టెన్ కూ తనదైన వ్యవహార శైలి ఉంటుంది, తొలి రెండు బంతులు వైడ్‌గా వేసినా దాదా ఏమనలేదు. పైగా ప్రతీ ఒక్కరికీ ఇలాగే జరుగుతుందని భరోసా ఇచ్చాడు. గంగూలీ అందరికీ అండగా ఉండే కెప్టెన్‌’ అని ఆర్పీ చెప్పాడు. రాహుల్‌ ద్రవిడ్‌ గురించి మాట్లాడుతూ అతనో టెక్నికల్‌ ప్లేయర్‌ అని మెచ్చుకున్నాడు. ఆట సాగే విధానాన్ని బట్టి రాహుల్‌ నిర్ణయాలు తీసుకుంటాడని ఆర్పీ అన్నాడు.

చివరగా మహేంద్ర సింగ్ ధోనీ గురించి స్పందించిన మాజీ పేసర్‌.. తానిప్పటివరకూ ధోనీ లాంటి కెప్టెన్‌ను చూడలేదని చెప్పాడు. ధోనీ కంటే ఎవరూ ఆటను బాగా అర్థం చేసుకోలేరని తెలిపాడు. అవకాశాల్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలో, ఎప్పుడు ఆటలో మార్పులు చేసుకోవాలో, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా మెలగాలో ధోనీకే బాగా తెలుసన్నాడు. తన కెరీర్‌లో ధోనీ లాంటి క్రికెటర్‌ని చూడలేదని చెప్పాడు. ఆటను మరో కోణంలో చూసే వ్యక్తి ధోనీ అని కీర్తించాడు. ఆర్పీసింగ్‌ 2011 వరకు భారత జట్టులో కొనసాగాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. కాగా, 2018లో అతను క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles