Hardik Pandya strong comeback ఫామ్ లోకి హార్థిక్ పాండ్యా.. 37 బంతుల్లో శతకొట్టేశాడు..

Good to be back on the field hardik pandya announces comeback

Hardik Pandya, DY Patil T20 Cup, Shreyas Iyer, Rohit Sharma, Mumbai Indians, Hardik Pandya, DY Patil T20 Cup, Cricket, cricket results, cricket news, cricket news liveCricket, Sports, sports news, cricket news, latest cricket news

Mumbai Indians fans welcomed their star India all-rounder Hardik Pandya who hinted that he has regained match fitness after suffering an acute lower back injury five months ago. The 26-year-old all-rounder smashed 100 runs off 37 deliveries in the DY Patil T20 Cup.

ఫామ్ లోకి హార్థిక్ పాండ్యా.. 37 బంతుల్లో శతకొట్టేశాడు..

Posted: 03/03/2020 09:35 PM IST
Good to be back on the field hardik pandya announces comeback

టీమిండియా యువ ఆల్ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య పూర్తి ఫామ్ లోకి వచ్చాడు. త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడాలని కాబోలు ఆకలిగొన్న పులిలా ప్రత్యర్థి బౌలర్లపై పంజా విసురుతున్నాడు. జాతీయ జట్టులో పునరాగమనానికి తాను సిద్ధమేనని తాజాగా తన అద్భుతమైన ప్రదర్శనతో సెలక్టర్లకు ముందు నిలిచాడు. వరల్డ్ కప్ టీమిండియా ప్రతిపాదిత జట్టులో తన పేరు ఉంటుందని బ్యాటుతో ప్రకటించాడు. డీవై పాటిల్‌ టీ20 టోర్నీలో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 37 బంతుల్లో శతకం బాదేశాడు. 39 బంతుల్లో 105 పరుగులు చేశాడు.

డీవై పాటిల్‌ టీ20లో రిలయన్స్‌ 1 తరఫున హార్దిక్‌ పాండ్య ఆడుతున్నాడు. కాగ్‌ (సీఏజీ)తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కళ్లు చెదిరే సిక్సర్లు, భారీ బౌండరీలతో దుమ్మురేపాడు. అతడు ఆడుతున్నంత సేపు బంతి బౌలర్‌ చేతిలో.. లేదంటే గాల్లోనే కనిపించింది. ఏకంగా 10 సిక్సర్లు, 7 బౌండరీలు బాదేశాడు. మైదానం అన్ని వైపులా అతడు షాట్లు ఆడటం గమనార్హం. అతడి విధ్వంసానికి కాగ్‌ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. వీ జీవరాజన్‌ వేసిన 15వ ఓవర్లో పాండ్య 3 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు సాధించాడు.

పాండ్య విజృంభణతో రిలయన్స్‌ 1 జట్టు 20 ఓవర్లలో 252/5తో నిలిచింది. ఇక స్టార్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ మరోసారి విఫలమయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. చివరి వారం జరిగిన మ్యాచ్ లోనూ హార్దిక్‌ దూకుడుగానే ఆడాడు. బ్యాంక్‌ ఆఫ్ బరోడాపై 25 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అదే మ్యాచులో భువనేశ్వర్‌, శిఖర్ ధావన్‌ సైతం తిరిగి మైదానంలో అడుగుపెట్టారు. మరి హార్థిక్ ఫామ్ ప్రపంచ కప్ వరకు ఇలాగే వుంటుందా.? ఇక వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయమా.? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Pandya  DY Patil T20 Cup  Mumbai Indians  Cricket  Sports  

Other Articles