Sunil Joshi named as new chairman of selectors బిసిసిఐ కొత్త చీప్ సెలక్టర్ గా సునీల్ జోషి..

The successor of msk prasad sunil joshi named as new chairman of selectors

Team India new chief selector, sunil joshi, Harvinder Singh, MSK Prasad, Devang Gandhi, Sarandeep Singh, Jatin Paranjape, BCCI, Cricket, cricket results, cricket news, cricket news liveCricket, Sports, sports news, cricket news, latest cricket news

The BCCI announced that the 3-member Cricket Advisory Committee (CAC) comprising Madan Lal, RP Singh and Sulakshana Naik, has recommended Sunil Joshi, former India spinner, for the role of Chairman of the senior men's selection committee. Harvinder Singh for roles in All-India Senior Selection Committee.

బిసిసిఐ కొత్త చీప్ సెలక్టర్ గా సునీల్ జోషి..

Posted: 03/04/2020 05:58 PM IST
The successor of msk prasad sunil joshi named as new chairman of selectors

టీమిండియా చీఫ్ సెలక్టర్ గా మాజీ క్రికెటర్ సునీల్ జోషి నియమితులయ్యాడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నుంచి జెషి త్వరలో బాధ్యతలను అందుకోనున్నారు. ఇటీవల ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీకాలం ముగిసింది. అయితే వీరి స్థానాల్లో కొత్త సెలక్టర్లను ఎంపిక చేసే బాధ్యత బిసిసిఐ త్రిసభ్య క్రికెట్ అడ్వైజరీ కమిటీపై పడింది. దీంతో మదన్ లాల్, ఆర్సీ సింగ్, సులక్షణ నాయక్ లతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ నూతన ఎంపికలను సిఫార్సు చేసింది.

ఈ క్రమంలో ముందుగా చీఫ్ సెలక్టర్, సెలక్టర్ స్థానాల భర్తీ కోసం బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో.. భారత మాజీ క్రికెటర్ల‌తో సహా మొత్తం 44 మంది దరఖాస్తు చేసుకున్నారు. చీఫ్ సెలక్టర్, సెలక్టర్ పదవి కోసం వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ).. వడపోత అనంతరం ఓ ఐదుగుర్ని మాత్రమే ఇంటర్వ్యూలకి పిలిచింది. ఇందులో సునీల్ జోషి, వెంకటేశ్ ప్రసాద్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, రాజేశ్ చౌహాన్, హర్విందర్ సింగ్ ఉన్నారు. ఇవాళ ఇంటర్వ్యూలు నిర్వహించిన క్రికెట్ సలహా కమిటీ.. చీఫ్ సెలక్టర్‌గా సునీల్ జోషి, సెలక్టర్‌గా హర్విందర్‌ సింగ్‌ పేర్లని బీసీసీకి ప్రతిపాదించింది.

దక్షిణాఫ్రికాతో మార్చి 12 నుంచి భారత్ జట్టు మూడు వన్డేల సిరీస్‌ ఆడనుండగా.. కొత్తగా ఎంపికైనా సెలక్షన్ కమిటీ ఈ సిరీస్‌కి టీమ్‌ని ఎంపిక చేయనుంది. వాస్తవానికి చీఫ్ సెలక్టర్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కార్ ఎంపికవుతాడనే వార్తలు వచ్చాయి. కానీ.. అనూహ్యంగా అతను కనీసం తుది జాబితాలో కూడా చోటు దక్కించుకోలేపోయాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడిన భారత్ జట్టు 0-3 తేడాతో వైట్‌వాష్‌కి గురైంది. ఈ నేపథ్యంలో కొత్త సెలక్టర్లు సాహసోపేత నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India new chief selector  sunil joshi  Harvinder Singh  MSK Prasad  bcci  Cricket  Sports  

Other Articles