India beat Sri Lanka by 18 runs in World Cup శ్రీలంకపై అవలీలగా గెలిచిన టీమిండియా

Icc women s t20 world cup radha s career best 4 23 shafali s 47 keeps wc winning streak alive

icc womens t20 world cup, india women cricket team, sri lanka women cricket team, india women vs sri lanka women, indw vs slw, slw vs indw, ind w vs sl w, shafali verma, radha yadav, cricket results, cricket news, cricket news liveCricket, Sports, sports news, cricket news, latest cricket news

Spinner Radha Yadav flummoxed the rival batting line-up with a career-best 4/23 before Shafali Verma's blistering 34-ball 47 powered India to a seven-wicket win over Sri Lanka in the ICC Women's T20 World Cup at Melbourne

మహిళల టీ-20 వరల్డ్ కప్: శ్రీలంకపై భారత్ ఘన విజయం

Posted: 02/29/2020 07:29 PM IST
Icc women s t20 world cup radha s career best 4 23 shafali s 47 keeps wc winning streak alive

ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు జైత్రయాత్ర అప్రతిహాతంగా కొనసాగుతోంది. శ్రీలంకతో ఇవాళ జరిగిన మ్యాచ్ లోనూ జట్టు సభ్యులు జయకేతనం ఎగురవేసి వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను తొలి మ్యాచ్‌లోనే కంగుతినిపించిన భారత్‌ జట్టు బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్లపై కూడా సునాయాస విజయాలతో సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే.

శ్రీలంకతో జరిగిన గ్రూప్‌-ఎ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మన జట్టు సభ్యులు విజయ దుందుభి మోగించారు. 114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని (116 పరుగులు) చేరుకుంది. షెఫాలీ వర్మ తన సూపర్‌ ఫామ్ కొనసాగించింది. ఆమెకి తోడుగా స్మృతి (12 బంతుల్లో 17) కూడా మెరవడంతో భారత్ కు మంచి ఆరంభమే దక్కింది. జట్టు స్కోరు 34 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది.

అనంతరం వన్ డౌన్ లో వచ్చిన సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (15) పరుగులకు వెనుదిరిగినా.. మొక్కవోని దైర్యంతో షెఫాలీ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే షెఫాలీ రనౌట్‌ గా వెనుదిరిగింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ కలిసి లక్ష్యాన్ని చేధించారు.  భారత బౌలర్లలో రాధాయాదవ్ నాలుగు వికెట్లు తీసుకోగా.. గైక్వాడ్ రెండు వికెట్లు, డి.బి.శర్మ, ఎస్.పాండే, పూనమ్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles