Faf du Plessis quits as South Africa captain నాకొద్దీ సారధ్యబాధ్యతలు డెప్లెసిస్

Faf du plessis steps down as south africa captain in all formats

Faf du Plessis, Faf du plessis steps down, Faf du plessis south Africa, Faf du Plessis all formats captain, Faf du Plessis captaincy, South Africa vs England, Du Plessis retirement, captainancy, South Africa, Team South Africa, Cricket

Senior batsman Faf du Plessis on Monday stepped down as captain of South Africa’s Test and T20 teams with immediate effect, citing “the need to facilitate the emergence of next generation of leaders.”

సంచలన నిర్ణయం తీసుకున్న డుప్లెసిస్.. ఇక..

Posted: 02/17/2020 10:01 PM IST
Faf du plessis steps down as south africa captain in all formats

దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫా డుప్లెసిస్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అన్ని ఫార్మెట్ల నుంచి సారథ్యభాద్యతలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. యువ నాయకత్వంలో అడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇలా చేయడం ద్వారా జట్టు మరింత ముందుకు వెళ్లడానికి అవకాశాలు వుండటంతో పాటు.. యువనాయకత్వం రానున్న కాలంలో మరిన్ని విజయాలను అస్వాధించడానికి.. దేశానికి అందించడానికి అస్కారం వుంటుందని తెలిపాడు.

కాగా డుప్లెసిస్ జట్టులో సభ్యుడిగా కొనసాగుతాడని ఆ దేశ క్రికెట్‌ బోర్డు సోమవారం స్పష్టం చేసింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన.. 2020 టీ20 ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెటర్‌గా తన కెరీర్‌ కొనసాగించడంపై దృష్టి సారించలేనని చెప్పాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు డుప్లెసిస్‌ విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

అయితే, ఇంగ్లాండ్‌ చేతిలో దక్షిణాఫ్రికా అటు టెస్టు సిరీస్‌, ఇటు టీ20 సిరీస్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. కొత్త నాయకత్వంలో యువ ఆటగాళ్లు సరైన మార్గంలో పయనిస్తున్నప్పుడు, అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం జట్టుకు ఎంతో మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డుప్లెసిస్‌ ఒక ప్రకటనలో చెప్పాడు. ఇదెంతో కఠినమైన నిర్ణయం అయినప్పటికీ క్వింటన్‌ డికాక్‌కు సహకరించడానికి కట్టుబడి ఉంటానని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Faf du Plessis  Du Plessis retirement  captainancy  South Africa  Team South Africa  Cricket  

Other Articles