Young India a top contender, says Kaur ప్రపంచకప్ కోసం శక్తివంచనలేని ప్రయత్నం: హర్మన్

Our team is growing day by day india women captain harmanpreet kaur

Harmanpreet Kaur, women’s T20 World Cup, Australia, Team India, England, Mithali raj, Jhulan Goswami, India captain Harmanpreet Kaur, cricket results, cricket news, cricket news liveCricket, Sports, sports news, cricket news, latest cricket news

India women captain Harmanpreet Kaur is confident that India have grown enough to be strong contenders to win the ICC Women’s T20 World Cup 2020.

ప్రపంచకప్ కోసం శక్తివంచనలేని ప్రయత్నం: హర్మన్

Posted: 02/18/2020 05:43 PM IST
Our team is growing day by day india women captain harmanpreet kaur

ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైంది. ఈనెల 21న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో భారత్‌ తొలి మ్యాచ్లో తలపడనుంది. ప్రపంచకప్ హాట్ ఫేవరెట్ జట్లలో టీమిండియా కూడా వుందని, వరల్డ్ కప్ కు హస్తగతం చేసుకోవాలని తాము తీవ్రంగా ప్రయత్నిస్తామని భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్ ప్రీత్ కైర్ తెలిపింది. ప్రపంచ కప్ ను ముద్దాడి దేశానికి అంకితమిచ్చేందుకు తాము ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బరిలోకి దిగుతామని వెల్లడించింది.

2017లో తాము అభిమానుల నుంచి పొందిన సపోర్టు, ప్రోత్సాహం మర్చిపోలేమని పేర్కోనింది. ఇంగ్లాండ్ లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ ఆతిథ్య జట్టు చేతిలో 9 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. అయినప్పటికీ అందరి మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం తమ జట్టు రోజు రోజుకీ మెరుగవుతోందని అన్నారు. జట్టులోని క్రీడాకారులందరూ సానుకూలంగా కనిపిస్తున్నారని అన్నారు.

ప్రస్తుతం జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తాము కైవసం చేసుకోవాలని ధృడసంకల్పంతో వున్నామని.. ఆమేరకు ఆటతీరులో కూడా మార్పులు, మెలకువలతో రాణిస్తున్నామని తెలిపింది. ట్రోఫీ గెలిస్తే తమ పేరు కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని.. ఇక దేశంలోనూ మహిళా క్రికెట్ కు ఎంతో ఆదరణ కలుగుతుందని చెప్పింది. ఆ మార్పు కోసం తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపింది. 2017లో మా ప్రదర్శనకు వచ్చిన స్పందన ఆశ్చర్యపరిచింది. మేం ఒత్తిడికిలోను కావొద్దని మా తల్లిదండ్రులు చెప్పారు. మేం గెలిస్తే చరిత్రలో నిలిచిపోతాం. అందుకోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం’ అని హర్మన్‌ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harmanpreet Kaur  women’s T20 World Cup  Team India  England  Australia  Cricket  Sports  

Other Articles