'Captain' Kohli on verge of yet another milestone హ్యాట్రిక్ రికార్డులను విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడా.?

India vs new zealand captain virat kohli on verge of yet another milestone

Virat Kohli, MS Dhoni, India vs New Zealand, Kane Williamson, faf du Plessis, cricket, virat kohli records, sports, cricket news, sports news, latest sports news

India skipper Virat Kohli has been breaking numerous records in the recent past and the run-machine is on the verge of achieving yet another milestone in his illustrious career.

హ్యాట్రిక్ రికార్డులను విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడా.?

Posted: 01/28/2020 08:06 PM IST
India vs new zealand captain virat kohli on verge of yet another milestone

రికార్డుల రారాజు, పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ పర్యటనలో మరికొన్ని రికార్డులపై కన్నేశాడు. తొలి టీ20లో 45 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే బుధవారం జరగనున్న మూడో టీ20లో కోహ్లీ 25 పరుగులు సాధిస్తే..  మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్ధలు కొట్టినవాడు అవుతాడు. భారత్ తరపున అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్ గా ధోనీ చేసిన పరుగులు 1,112.

అయితే ధోని రికార్డును విరాట్ కోహ్లీ కెప్టెన్ హోదాలో అందుకోవాలంటే మరో పాతిక (25) పరుగులు సాధించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అయితే ఈ రికార్డును విరాట్ రేపు కొల్లగడని అభిమానులు ఆనందంలో వున్నారు. కెప్టెన్లుగా ఉండి టీ20లలో అత్యధిక పరుగులు చేసిన వారిలో డుప్లెసిస్ (1,273), కేన్ విలియమ్సన్ (1,148) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అలాగే అంతర్జాతీయ టీ20లో 50 కన్నా అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో డుప్లెసిస్ తో కలిసి కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక విరాట్ కోహ్లీ మరో అర్థ సెంచరీని సాధిస్తే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరసన చేరతాడు. ప్రస్తుతానికి ఎలాంటి ఒత్తడి లేని మ్యాచ్ కాబట్టి విరాట్ అర్థశతకాన్ని నమోదు చేసిన ఈ రెండు రికార్డులను అధిగమిస్తాడా.? అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో రికార్డు విషయానికి వస్తే అంతర్జాతీయ టీ20లలో 50 సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల లిస్ట్‌లో చేరడానికి కోహ్లీకి ఏడు సిక్సర్లు అవసరం. ఈ ఫీట్‌ను ఇప్పటి వరకు ఇంగ్లీష్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రమే సాధించాడు. కోహ్లీ మరో ఏడు సిక్సర్లు సాధిస్తే కెప్టెన్‌గా 50 సిక్సర్లు కొట్టిన రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  MS Dhoni  India vs New Zealand  Kane Williamson  faf du Plessis  cricket  

Other Articles