Azharuddin booked for cheating travel agent టీమిండియా మాజీ కెప్టెన్ పై చీటింగ్ కేసు

Case against mohammed azharuddin 2 others for cheating travel agent

Azharuddin, CHEATING CASE, Cricket World Cup, Cricket, Azharuddin, Azhar, Marathi people, Mohammed Azharuddin, City Chowk police station, Captain, police official, official, travel agent, personal assistant, Mohammed Shahab, Sudesh Awakkal, payment, Maharashtra, Crime

A case has been registered against former Indian cricketer Mohammed Azharuddin and two others in Aurangabad in Maharashtra after a travel agent lodged a police complaint alleging that they cheated him to the tune of Rs 20.96 lakh

టీమిండియా మాజీ కెప్టెన్ పై చీటింగ్ కేసు

Posted: 01/23/2020 08:33 PM IST
Case against mohammed azharuddin 2 others for cheating travel agent

టీమిండియా మాజీ కెప్టెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మహమ్మద్ అజారుద్దీన్ పై చీటింగ్ కేసు నమోదైంది. తమ ట్రావెల్స్ నుంచి వివిధ ప్రాంతాలకు విమాన టికెట్లు కోనుగోలు చేసిన ఆయన వాటికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఆయనపై పోలీసులు చీటింగ్ కేసు నమోదే చేసి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు. ఈ కేసులో అజారుద్దీన్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై కూడా మహరాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ మేరకు వివరాలు ఇలా వున్నాయి. అజారుద్దీన్ సహా మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తనను 20 లక్షల మేర మోసం చేశారు అంటూ..  దానిష్ ట్రావెల్స్ ద్వారా వివిధ ప్రాంతాలకు విమాన ప్రయాణాలను అజారుద్దీన్ టికెట్లు బుక్ చేశారని.. దానికి సంబంధించి రూ.20 లక్షలు చెల్లించకుండా మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు అజారుద్దీన్ సహా మరో ఇద్దరు వ్యక్తుల పై  ఔరంగాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇక ఔరంగాబాద్ పోలీస్ స్టేషన్లో తన పై చీటింగ్ ఆరోపణలతో కేసు నమోదు చేయడంపై  అజారుద్దీన్ స్పందించారు. ఎవరో తప్పుడు ఆరోపణలు చేస్తే... ఎలాంటి విచారణ జరపకుండా తన పై ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు అంటూ పోలీసులను ప్రశ్నించారు మహమ్మద్ అజారుద్దీన్. పోలీసులు ప్రస్తుతం తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న తన పరువు పోయేలా ఆరోపణలు చేసిన వ్యక్తి పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Poonam yadav s magical spell helps india beat australia in women s t20 world cup

  మహిళల టీ-20లో భారత్ శుభారంభం.. అసీస్ పై గెలుపు

  Feb 21 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు శుభారంభం చేసింది. హాట్ ఫేవరెట్ జట్టైన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును స్వదేశంలోనే చిత్తుచేసింది. మహిళల టీ-20 ఆరంభపు... Read more

 • Pragyan ojha announces retirement from all forms of cricket

  స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక నిర్ణయం.. క్రికెట్ కు దూరం

  Feb 21 | టీమిండియా వెటరన్‌ లెఫ్మార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ఓజా ప్రకటించాడు. ఈ మేరకు తన ట్వీటర్‌... Read more

 • Play bilateral series or cut off all ties with pakistan shoaib akhtar to india

  భారత్ పాక్ ద్వైపాక్షిక క్రికెట్ పైనే ఎందుకు ఆంక్షలు

  Feb 18 | భారత్-పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులను నిలిపిపేసి ఎనిమిదేళ్లు కావస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చాలని పాకిస్తాన్ పేసు గుర్రంగా, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన వెటరన్... Read more

 • Our team is growing day by day india women captain harmanpreet kaur

  ప్రపంచకప్ కోసం శక్తివంచనలేని ప్రయత్నం: హర్మన్

  Feb 18 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైంది. ఈనెల 21న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో భారత్‌ తొలి మ్యాచ్లో తలపడనుంది. ప్రపంచకప్ హాట్ ఫేవరెట్... Read more

 • Faf du plessis steps down as south africa captain in all formats

  సంచలన నిర్ణయం తీసుకున్న డుప్లెసిస్.. ఇక..

  Feb 17 | దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫా డుప్లెసిస్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అన్ని ఫార్మెట్ల నుంచి సారథ్యభాద్యతలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. యువ నాయకత్వంలో అడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇలా చేయడం... Read more

Today on Telugu Wishesh