India beat New Zealand in Super Over టీమిండియా సూపర్ ఓవర్ విజయం.. సిరీస్ కైవసం..

India vs new zealand 3rd t20i highlights india beat new zealand in super over win series

Cricket news, Virat Kohli, Rohit Sharma, KL Rahul, Super Over, India vs New Zealand, Kane Williamson, Cricket score, india vs new zealand score, india vs new zealand 3rd t20, India vs New Zealand, ind vs nz t20, IND vs NZ 2020, cricket score, sports, cricket news, sports news, latest sports news

Rohit Sharma struck two sixes off the last two balls in the Super Over as India beat New Zealand in the third T20I at Seddon Park in Hamilton. Batting first, India had put up 179/5 before New Zealand were restricted to 179/6. Skipper Kane Williamson brought up his highest T20I score of 95 but a superb final over from Mohammed Shami made sure that the third T20I ended in a tie.

ఉత్కంఠపోరులో టీమిండియా సూపర్ ఓవర్ విజయం.. సిరీస్ కైవసం..

Posted: 01/29/2020 05:32 PM IST
India vs new zealand 3rd t20i highlights india beat new zealand in super over win series

అతిధ్యజట్టు న్యూజీలాండ్ తో రసవత్తరంగా సాగిన మూడో టీ20లో టీమిండియా హ్యాట్రిక్ విజయంతో సీరిస్ ను చేజిక్కించుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠకరంగా సాగిన పోరులో విరాట్ సేన ఏమాత్రం తగ్గకుండా పోరాడింది. ఫలితంగా మూడవ టీ20లో రెండు జట్లు సమాన స్కోరునే చేయడంతో ఫలితం తేల్చేందుకు రెండు జట్ట మధ్య సూపర్ ఓవర్ కీలకంగా మారింది. అయితే సూపర్ ఓవర్ లోనూ కడవరకు ఉత్కంఠకు తెరలేపగా.. చివరి బంతిని సిక్స్ గా మలిచి భారత్ కు బ్లాక్ క్యాప్స్ పై మూడవ విజయాన్ని అందించడంతో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకునేలా చేశాడు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ.

హమిల్టన్ వేదికగా సెడాన్ పార్కులో జరిగిన మూడవ టీ20లో టాస్ ఓడిన విరాట్ సేనను తొలుత బ్యాటింగ్ కు దించింది అతిధ్య జట్టు. మొదటి రెండు టీ20లలో విఫలమైన రోహిత్‌ శర్మ ఈ టీ20లో వీరవిహారం చేశాడు. కేవలం 40 బంతుల్లో 65 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్‌ కూడా 19 బంతుల్లో 27 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించారు. వీరి ధాటికి 8 ఓవర్లకే స్కోరు 80 దాటింది. స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్న ఈ భాగస్వామ్యాన్ని తొమ్మిదో ఓవర్‌ వేసిన గ్రాండ్ హోమ్ ఆఖరి బంతితో విడదీశాడు.

ఆ వెంటనే రోహిత్‌, శివమ్‌ దూబె (3) ఔటవ్వడంతో స్కోరు వేగం తగ్గింది. ఈ క్రమంలో 27 బంతుల్లో 38 పరుగులతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బ్యాటును జుళిపించాడు.  ఆ తరువాత శ్రేయస్‌ అయ్యర్‌ (17) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే చివరి ఓవర్లకు చేరకునే సరికి  కివీస్‌ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని భారత్ భ్యాట్స్ మెన్లను క్రీజులో నిలదొక్కుకోనీయకుండా ఔట్‌ చేసి రన్‌రేట్‌ తగ్గించారు. చివర్లో మనీశ్‌ పాండే ఆరు బంతుల్లో 14పరుగులతో, రవీంద్ర జడేజా ఐదు బంతుల్లో పది పరుగులతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లకు భారత్‌ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

కాగా, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్ ఒంటిచేత్తో మ్యాచ్ ను విజయతీరాల వరకు చేర్చాడు. కేవలం 48 బంతుల్లో 95 పరుగులు సాధించాడు. బుమ్రా వేసిన 19 ఓవర్లో 11 పరుగులు రావడంతో కివీస్‌ 171/4తో నిలిచింది. సమీకరణం 6 బంతుల్లో 9గా మారింది. ఆఖరి ఓవర్‌ను షమి వేశాడు. తొలి బంతికి కేన్‌ సిక్సర్‌గా మలచడంతో ఇక విజయం లాంఛనమే అనుకున్నారు. అయితే అఖరి ఓవర్ వేసిన షమీ తనదైన రీతిలో విరుచుకుపడటంతో న్యూజీలాండ్ స్కోరు కూడా 179/6 కావడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్ కు దారితీసింది.

సూపర్ ఓవర్ ఫలితం ఇలా..

కివీస్ తరఫున విలియమ్సన్, గప్టిల్ బరిలో దిగి 6 బంతుల్లో 17 పరుగులు చేశారు. బుమ్రా పదునైన బంతులు విసిరినా ఓ సిక్సర్, బౌండరీలతో 17 పరుగులను సాధించిన కివీస్ భారత్ ఎదుట 18 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత్ తరపున బరిలో దిగిన రోహిత్, రాహుల్ జోడీకి కివీస్ పేసర్ సౌథీ పదునైన యార్కర్లు రుచి చూపించాడు. తొలి బంతికి రోహిత్‌ 2 పరుగులు, ఆ తరువాత బంతికి ఒకటి, మూడో బంతిని బౌండరీ.. నాలుగో బంతికి ఒక్క పరుగుతో స్కోరు 8కి చేరింది. దీంతో చివరి రెండు బంతులకు ఒక బౌండరీ, ఒక సిక్స్ అవసరం ఏర్పడింది. క్రీజులో వున్న రోహిత్ వరుసగా 5, 6వ బంతులను స్టాండ్స్ లోకి పంపడంతో భారత్ గెలుపుతీరాలకు చేరింది. ఈ మ్యాచ్ విజయంతో 5 టి20ల సిరీస్ ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 జనవరి 31న వెల్లింగ్టన్ లో జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Rohit Sharma  KL Rahul  Super Over  India vs New Zealand  Kane Williamson  cricket  sports  

Other Articles