World Cup An "Obsession" for Team India: Ravi Shastri వరల్డ్ కప్ కోరికను విరాట్ ఆర్మీ తీరుస్తారు: రవిశాస్త్రీ

Winning world cup an obsession will do all for it ravi shastri

Virat Kohli, Ravi Shastri, World Cup, KL Rahul, Kedar Jadav, india vs new zealand, ind vs nzl 2020, ind-nzl series, sports news, cricket, sports, cricket, sports

Australian pace spearhead Pat Cummins expects spinners of his team to play a bigger role in the ODI series against India even though he is not expecting dust-bowls during a limited-overs assignment.

వరల్డ్ కప్ కోరికను విరాట్ ఆర్మీ తీరుస్తారు: రవిశాస్త్రీ

Posted: 01/22/2020 07:53 PM IST
Winning world cup an obsession will do all for it ravi shastri

టాస్‌, పత్యర్థి, పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతీ మ్యాచ్‌ గెలవాలనే కసితో ప్రస్తుత టీమిండియా ఉందని కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఎన్నో అపూర్వ విజయాలను అందుకున్నామని, అయితే ప్రపంచకప్‌ గెలవాలనే కోరిక కోహ్లి సేనకు అలాగే ఉండిపోయిందన్నారు. అయితే ఆ కోరికను కూడా కోహ్లి సారథ్యంలోని టీమిండియా నెరవేర్చుకోబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా రవిశాస్త్రి పై వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియామా సమీకరణాల్లో టాస్‌ అంశాన్ని తీసేశామని.. అన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్యత్యర్థి బలాబలాలతో సంబంధ లేకుండా బాగా ఆడాలనుకున్నామని చెప్పాడు. కేవలం స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి విజయాలు, రికార్డులను నమోదు చేయాలనుకున్నామని.. ఇప్పటివరకు తాము అనుకున్నవి చేశామన్నారు. ఇక ముందు కూడా చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రపంచ కప్‌ ఒక్కటి మిగిలిపోయిందిని అన్నాడు. దానిని కూడా త్వరలోనే సాధించాలని టీమిండియా పట్టుదలతో వుందన్నాడు.

ఇక చాయిస్‌లు ఎక్కువగా ఉండటం టీమిండియాకు ఎంతో లాభం చేకూరుతుంది. ఆటగాళ్ల మధ్య పోటీ ఎంత ఎక్కువ ఉంటే ఆంత ఎక్కువగా వారి నుంచి ఆట బయటకు తీసుకువస్తుందని అన్నాడు. ప్రస్తుత ఆటగాళ్లు​ ఏ పాత్ర పోషించడానికైనా సిద్దంగా ఉన్నారని అన్నాడు. ఇక కొంతమంది ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదని నన్ను ప్రశ్నిస్తున్నారు. వారందరికీ నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. తాను సెలక్టర్ ను కాదు కోచ్ నన్న విషయాన్ని వారికి గుర్తు చేయాల్సివస్తోందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles