‘‘Ganguly's 'ODI Super Series' idea innovative’’ దాదా ప్రతిపాదన అద్భుతం.. స్వాగతించిన సీఏ

Cricket australia terms sourav ganguly s odi super series idea innovative

India vs England, Australia, Sri Lanka T20Is, India vs Australia, sourav ganguly, odi super series, Kevin Roberts, Cricket Australia, Board of Control for Cricket in India, bcci president, bcci, BCCI, BCCI's selection policy, Team India, Cricket, sports, sports news, cricket, sports, cricket, sports

Cricket Australia chief executive Kevin Roberts has termed BCCI President Sourav Ganguly's idea for a four-nation 'ODI Super Series' as "innovative" but stopped short of giving any commitment.

దాదా ప్రతిపాదన అద్భుతం.. స్వాగతించిన సీఏ.. ప్రశంసల వర్షం

Posted: 12/27/2019 08:47 PM IST
Cricket australia terms sourav ganguly s odi super series idea innovative

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్‌ గంగూలీ తీసుకువచ్చిన ప్రతిపాదన అద్భుతమంటూ ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. అస్ట్రేలియా క్రికెట్ (సీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ దాదా ప్రతిపాదించిన వన్డేల సూపర్‌ సిరీస్‌ ఆలోచన ఎంతో సృజనాత్మకంగా ఉందని కొనియాడారు. భారత్, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, మరో దేశం కలిపి 2021 నుంచి ప్రతి ఏటా నాలుగు దేశాల టోర్నీ ఆడాలని దాదా గతంలో ఆ బోర్డులతో చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని ఇటీవల ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సీఏ కూడా స్పందించింది.

‘‘బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రతిపాదించిన ఆలోచన సృజనాత్మకమైనది. అతడి పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే కోల్‌కతాలో చారిత్రక డే/టెస్టు నిర్వహించాడు. అది ఎంతో సత్ఫలితాన్నిచ్చింది.  ఇప్పుడు సూపర్ సిరీస్‌ అనే మరో మంచి ఆలోచనతో ముందుకు వచ్చాడు. వచ్చే నెలలో భారత్, బంగ్లాదేశ్‌తో క్రికెట్‌ క్యాలెండర్‌ గురించి చర్చిస్తాం. ఆ తర్వాత పాక్‌, కివీస్‌తో కూడా మాట్లాడతాం. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. ప్రపంచ క్రికెట్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాం. వచ్చే ఏడాది అఫ్గానిస్థాన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాం. ప్రపంచ క్రికెట్‌పై మాకు ఉన్న గౌరవానికి ఇది ఉదాహరణ’’ అని రాబర్ట్స్‌ అన్నారు.

‘‘ఉపఖండంలో క్రికెట్‌ అనేది ఓ మతం. భారత్, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల్లో క్రికెట్‌ అందరికీ ఫేవరేట్‌. అన్ని దేశాల్లోనూ క్రికెట్‌ అభివృద్ధి చెందుతుంది. న్యూజిలాండ్‌తో మాకు మంచి అనుబంధం ఉంది. 2023-31 వరకు క్రికెట్‌ క్యాలెండర్‌ గురించి మేం చర్చించుకున్నాం. మరో 32 ఏళ్ల వరకు కివీస్‌ను బాక్సింగ్‌ డే టెస్టుకు ఆహ్వానించాలని ఆశిస్తున్నాం. ప్రపంచంలో టెస్టులను నిర్వహించడానికి మెల్‌బోర్న్‌, లార్డ్స్‌ మైదానాలు ఎంతో ప్రసిద్ధి’’ అని ఆయన తెలిపారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు ఆడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles