Hopeful of making an ODI comeback: Rahane 50 ఓపర్ల ఫార్మెట్లోకి త్వరలోనే రీ-ఎంట్రీ ఇస్తా

Anything can happen in this funny game ajinkya rahane

Ajinkya Rahane, Ajinkya Rahane ODI comeback, Ajinkya Rahane Tests, Ajinkya Rahane career, Rahane county cricket, Rahul Dravid, Indian Cricket Team, MSK Prasad, BCCI, BCCI's selection policy, Team India, Cricket, sports, sports news, cricket, sports, cricket, sports

Ajinkya Rahane has not been part of India's ODI squad over the last two years, but the vice-captain in the longest format of the game is hopeful of making a comeback in the side as he feels anything can happen in the 'funny game of cricket'.

50 ఓపర్ల ఫార్మెట్లోకి త్వరలోనే రీ-ఎంట్రీ ఇస్తా

Posted: 12/27/2019 09:20 PM IST
Anything can happen in this funny game ajinkya rahane

వన్డే జట్టులో తిరిగి చోటు సంపాదిస్తానని టీమిండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె ధీమా వ్యక్తం చేశాడు. ‘‘గత రెండేళ్లగా నా రికార్డు బాగానే ఉందనేది నిజం. క్రికెట్‌ అనేది ఫన్నీ గేమ్‌. అందులో ఏమైనా జరగొచ్చు. తిరిగి వన్డే జట్టులో చోటు సంపాదిస్తాననే నమ్మకం ఉంది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అవరోధాలు ఎదురైనప్పుడు అక్కడే ఆగి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. 2019 ప్రపంచకప్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ సమయంలో ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడి నా ఆటతీరుని మెరుగుపర్చుకున్నా. అంతేకాకుండా వ్యక్తిగా కూడా ఎదిగా. ఆ రెండు నెలల్లో ఏడు మ్యాచ్‌లు ఆడా. ఆన్‌ ఫీల్డ్‌తో పాటు ఆఫ్‌ ఫీల్డ్‌లోనూ ఎంతో నేర్చుకున్నా’’ అని తెలిపాడు.

‘‘కొన్ని సార్లు పార్క్‌లో ఒంటరిగా జాగింగ్‌కు వెళ్తూ ఉంటా. కాఫీ తాగుతూ గత రోజులను గుర్తు చేసుకుంటాను. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేయక ముందు క్లబ్‌ క్రికెట్‌ ఆడే రోజుల్లో నా మనస్తత్వం ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుంటాను. నా ప్రశ్నలకు అవి సమాధానమిస్తుంటాయి’’ అని రహానె పేర్కొన్నాడు. వన్డేల్లో భారత తరఫున అతడు చివరిగా 2018, ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ ఆడాడు. సఫారీలతో జరిగిన ఆ సిరీస్‌లో అతడు 35 సగటుతో 140 పరుగులు చేశాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. 2019 ప్రపంచకప్‌కు ఎంపికవ్వలేదు. భారత్‌ తరఫున ఇప్పటివరకు అతడు 63 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 4.112 పరుగులు, వన్డేల్లో 2,962 పరుగులు, టీ20ల్లో 375 పరుగులు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles