England cricket legend Bob Willis No more ఇంగ్లాండ్ క్రికెట్ బౌలింగ్ లెజండ్ బాబ్ విల్స్ కన్నుమూత

Bob willis dies viv richards leads tributes to legendary england fast bowler

Bob Willis, Bob Willis death, England cricketer death, England fast bowlers, Viv Richards Bob Willis, Bob Willis Ashes, Darren Gough, Geoffery Boycott Bob Willis, sports news, cricket, sports, cricket, sports

The former England cricket captain Bob Willis has died at the age of 70. He will be forever linked with one of the most remarkable comebacks in cricketing history, when his spectacular display of fast bowling overwhelmed Australia to help win the Ashes in 1981.

క్రికెట్ లెజండ్ బాబ్ విల్స్ కన్నుమూత..

Posted: 12/05/2019 07:33 PM IST
Bob willis dies viv richards leads tributes to legendary england fast bowler

ఇంగ్లండ్ క్రికెట్ లెజండ్ బాబ్ విల్లిస్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విల్లీస్, మరణవార్తను ఆయన కుటుంబసభ్యులు ధృవీకరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతితో క్రికెట్ అభిమానుల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు, దిగ్గజాలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కొందరు 1981లో యాషెస్ సిరీస్ లో అస్ట్రేలియాపై విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించిన విషయాన్ని రమారమి అందరూ క్రికెటర్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన బంతి వేగానికి కళ్లాలు లేవని కొనియాడుతున్నారు. అందుకనే ఆయన ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రపై లిఖించిన అక్షరాలు ఇప్పటికే చెరిగిపోలేదు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు కావస్తున్న ఇప్పటికే ఆయన అత్యధిక వికెట్లు సాధించిన నాలుగో బౌలర్ గా కొనసాగడమే ఇందుకు నిదర్శనం.

కాగా, 1971లో క్రికెట్‌ కెరీర్ ను ప్రారంభించిన ఆయన, 90 టెస్టులు, 64 వన్డేల్లో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 325 వికెట్లు తీసుకున్నారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాక చాలాకాలం పాటు కామెంటేటర్ గా పనిచేశారు. బాబ్ విల్లీస్ మృతి పట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసెర్ హుస్సెన్, విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, న్యూజీలాండ్ మాజీ పేసర్ రిచర్డ్ హ్యాడ్లీ, ది టైమ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మ్యాచ్ డికిన్ సన్, ఇంగ్లాండ్ మాజీ అసిస్టెంట్ కోచ్ పాల్ ఫార్ర్బేస్, దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ డారెన్ గాఫ్, బాబ్ విల్లీస్ సహచర క్రికెటర్ జియోఫ్రీ బాయ్ కాట్ తదితరులు తమ సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles