Razzaq Calls Bumrah A 'Baby Bowler' బుమ్రా తరువాత విరాట్ కోహ్లీపై రజాక్ విసుర్లు..

Bumrah a baby kohli not same class as sachin pakistan s abdul razzaq mocks

bdul Razzaq, Jasprit Bumrah, Wasim Akram, Glenn Mcgrath, Sachin Tendulkar, Virat Kohli, Team India, bowling style, good batsman, Twitter, sports, cricket news, latest cricket news, sports, cricket

Former Pakistan all-rounder Abdul Razzaq has said that had he been active till now, he would have "easily dominated and attacked baby bowler" Jasprit Bumrah. Razzaq also said Indian captain Virat Kohli was not at the same level as legend Sachin Tendulkar.

బుమ్రా తరువాత విరాట్ కోహ్లీపై రజాక్ విసుర్లు..

Posted: 12/05/2019 08:35 PM IST
Bumrah a baby kohli not same class as sachin pakistan s abdul razzaq mocks

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ టీమిండియా క్రికెటర్లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. టీమిండియా పేస్ దిగ్గజం జస్ప్రిత్ బుమ్రా తరువాత ఆయన ఏకంగా భారత్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కోహ్లీ నిలకడగా ఆడుతుండొచ్చు గానీ దిగ్గజ ఆటగాడైన సచిన్‌ తెందూల్కర్‌ క్లాస్‌ అతడిలో లేదంటున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌ ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆయన పేర్కొన్నాడు.

తాము ఆడిన 1992-2007 కాలం నాటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు తనకిప్పుడు కనిపించడం లేదని అన్నాడు. టీ20 క్రికెట్‌ ఆటను సమూలంగా మార్చేసిందని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో పస లేకుండా పోయిందని.. ఇప్పుడంతా సాధారణ క్రికెట్‌ ఆడుతున్నారని అన్నాడు. ఒకసారి విరాట్‌ కోహ్లీని చూడండి. చేసినప్పుడే పరుగులు చేస్తాడని.. టీమిండియాకు అతనో మంచి ఆటగాడని.. నిలకడగా రాణిస్తాడని అయినా.. సచిన్‌ తెందూల్కర్‌ క్లాస్ కు మాత్రం చెందడని అభిప్రాయపడ్డాడు. సచిన్‌ ప్రత్యేకమైనవాడని రజార్ చెప్పుకోచ్చాడు.

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాను బేబీ బౌలరని వ్యాఖ్యానించాడు రజాక్. తానిప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఉండుంటే బుమ్రాపై సులభంగా ఆధిపత్యం చెలాయించే వాడినని పేర్కొన్నాడు. కెరీర్లో ప్రపంచ స్థాయి పేసర్లు గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, వసీమ్‌ అక్రమ్‌తో ఆడిన తనకు బుమ్రాను ఎదుర్కోవడం ఓ లెక్క కాదని పేర్కోన్నాడు. తనకు బౌలింగ్‌ చేస్తే ఒత్తిడి బుమ్రాపైనే ఉంటుందని రజాక్‌ అన్నాడు. అయితే.. అతడి బౌలింగ్‌ శైలిని మాత్రం ప్రశంసించాడు. ‘బుమ్రా బౌలింగ్‌ శైలి భిన్నంగా ఉంటుందని అన్నాడు. అనుకున్న ప్రాంతంలో బంతిని కచ్చితంగా విసరగలడని.. అందుకే అంత ప్రభావం చూపిస్తున్నాడని రజాక్‌ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles