Gambhir interesting comments on Team India line-up కోహ్లీసేన బ్యాటింగ్ లైనఫ్ పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gautam gambhir interesting comments on team india line up

Virat kohli, Rohit Sharma, Gautam Gambhir, Team India Bowling line-up, 5 seamers, 3 spinners, Jasprit Bumrah, Bhiuvaneswar kumar, Kuldeep Yadav, Cricket news, sports news, Cricket, sports

Former Indian opener Gautam Gambhir made interesting comments on Team India Bowling line-up, says it is of enough strenth, with 5 seamers and 3 spinners, including Bumrah, Bhuvi and Kuldeep.

కోహ్లీసేన బ్యాటింగ్ లైనఫ్ పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Posted: 11/19/2019 09:35 PM IST
Gautam gambhir interesting comments on team india line up

భారత బౌలింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా వుందని బంగ్లాదేశ్ ఆటగాడు ప్రశంసించిన తరుణంలో అదే బాటలో పయనించాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ప్రస్తుతం టీమిండియాకు పరిపూర్ణ బౌలింగ్‌ విభాగం ఉందని అభిప్రాయపడ్డాడు. బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. వారు అద్భుతంగా రాణిస్తుండటంతోనే కోహ్లీసేన మ్యాచులలో ప్రత్యర్థి జట్టు 10 వికెట్లు తీసి ఖాతాలో వేసుకోగలుగుతోందని పేర్కొన్నాడు. జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు, పేసర్లు ఉన్నారని వెల్లడించాడు.

‘మీరొక సారి ప్రత్యర్థి జట్లను గమనిస్తే కొన్ని జట్లకు నాణ్యమైన పేస్‌ దాడి మాత్రమే ఉంది. కొన్నింట్లో మెరుగైన స్పిన్నర్లు ఉన్నారు. అదే మీరు టీమిండియాను పరిశీలించండి. ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు, ముగ్గురు దుర్భేద్యమైన పేసర్లతో నిండిఉంది. ప్రస్తుతం జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ తుది జట్టులో లేరు. వీరితో కుల్దీప్‌ యాదవ్‌ జతకలిస్తే కోహ్లీసేనకు ఐదుగురు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో కలిసి 8 మంది బౌలర్లు ఉంటారు. వీరంతా ప్రత్యర్థి బ్యాటింగ్‌ లైనప్ ను కకావికలం చేయగలరు. అందుకే రెండేళ్లుగా టీమిండియా ఎక్కువగా ఆలౌట్లు చేయగలుగుతోంది’ అని గంభీర్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles