India Women Continue Dominance In West Indies వెస్టిండీస్ పై కొనసాగుతున్న టీమిండియా అదిపత్యం..

India women shine again to win 4th t20i against windies

smriti mandhana, India Women tour of West Indies 2019, West Indies Women vs India Women, India national women's cricket team, West Indies women's cricket team, T20, harmanpreet kaur, Pooja Vastrakar, Anuja Patil, Deepti Sharma, Radha Yadav, Hayley Mathews, Afy Fletchercricket news, sports news, cricket, sports

In a rain-curtailed nine overs a side game, India women's cricket team held its nerve to overcome West Indies by five runs to take a 4-0 lead in the five-match T20 series in Guyana continuing their dominance.

వెస్టిండీస్ పై కొనసాగుతున్న టీమిండియా అదిపత్యం..

Posted: 11/18/2019 08:46 PM IST
India women shine again to win 4th t20i against windies

వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా జట్టు తమ విజయాల పరంపరను కొనసాగిస్తూ అతిథ్యజట్టుపై అధిపత్యాన్ని కనబరుస్తూనే వుంది. వరుసగా మూడు టీ20 మ్యాచులను తమ ఖాతాలో వేసుకున్న టీమిండియా నాల్గో మ్యాచ్ లోనూ అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా టీమిండియా బౌలర్లు రాణించడంతో వెస్టిండీస్ పై భారత మహిళా జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా గయానాలో జరిగిన నాలుగో మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు.

దీంతో మ్యాచ్ ను అంపైర్లు తొమ్మిది ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ ఉమెన్ తడబాటుకు గురై వికెట్లను జారవిడుచుకున్నారు. ఒక్క పూజా వస్త్రకార్ మినహాయించి ఎవ్వరూ రెండెంక్కెల స్కోరుకు చేరుకోలేకపోయారు. విండీస్‌ బౌలర్లలో మాథ్యూస్‌ (3/13) సత్తా చాటింది. దీంతో టీమిండియా ఉమెన్స్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. విండీస్‌ బౌలర్లలో మాథ్యూస్‌ (3/13) సత్తా చాటింది.

నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచులో వెస్టిండీస్ ను భారత బౌలింగ్ కుప్పకూల్చింది. భారత బౌలర్ల రాణించడంతో వారి ధాటికి విండీస్ మహిళల జట్టు నిలవలేకపోయింది. విండీస్ జట్టు చివరి వరకు పోరాడినా ఐదు వికెట్ల నష్టానికి 45 పరుగులే చేయగలిగింది. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పిన్నర్లపై పెట్టుకున్న ఆశలను వారు నిలబెట్టు కున్నారు. అంజు (2/8), దీప్తి శర్మ (1/8), రాధ (1/8) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో టీమ్‌ఇండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఫలితంగా హర్మన్‌ప్రీత్‌ సేన 5 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. సిరీస్‌లో ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్‌ చివరి మ్యాచ్‌ను నవంబర్‌ 20న ఆడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Virat kohli ticks off kesrick williams to unleash his inner pant

  విలియమ్స్ పై విరాట్ కోహ్లీ బదులు తీర్చుకున్నాడోచ్..!

  Dec 07 | టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్ ను ఉద్దేశించి... Read more

 • Bumrah a baby kohli not same class as sachin pakistan s abdul razzaq mocks

  బుమ్రా తరువాత విరాట్ కోహ్లీపై రజాక్ విసుర్లు..

  Dec 05 | పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ టీమిండియా క్రికెటర్లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. టీమిండియా పేస్ దిగ్గజం జస్ప్రిత్ బుమ్రా తరువాత ఆయన ఏకంగా భారత్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీని టార్గెట్ చేస్తూ... Read more

 • Bob willis dies viv richards leads tributes to legendary england fast bowler

  క్రికెట్ లెజండ్ బాబ్ విల్స్ కన్నుమూత..

  Dec 05 | ఇంగ్లండ్ క్రికెట్ లెజండ్ బాబ్ విల్లిస్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విల్లీస్, మరణవార్తను ఆయన కుటుంబసభ్యులు ధృవీకరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... Read more

 • Don t speculate on ms dhoni wait till the ipl ravi shastri

  ధోనిపై అప్పుడే ఊహాగానాలు వదన్న కోచ్.!

  Nov 26 | టీమిండియాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించక నెలలు గడుస్తోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టకు దూరమైన ధోని.. ఆ తరువాత రెండు నెలల పాటు భారత ఆర్మీతో కలసి... Read more

 • I was a friend of warne so australia didn t sledge me anil kumble

  అసీస్ నన్నెప్పుడూ స్లెడ్జింగ్ చేయలేదు: అనీల్ కుంబ్లే

  Nov 26 | ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టులోని బౌలర్లు, బ్యాట్స్ మెన్లకు స్లెడ్జింగ్‌ పిచ్చ పీక్స్ లోకి తీసుకెళ్తుంది.. అంతేకాదు.. వారి ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. ఇది సహజంగా ఆదేశ పర్యటనకు వెళ్లే ప్రతీ ఆటగాడు చెసే పిర్యాదు.... Read more

Today on Telugu Wishesh