Gambhir to be honoured with a stand at Arun Jaitley Stadium కోహ్లీ తరువాత గంభీర్ కు అరుదైన గౌరవం..

After virat kohli now ddca is set to honour gautam gambhir with a stand

Virat kohli, gautam gambhir, indian cricket team opener, arun jaitley stadium, Feroz Shah Kotla Stadium, Virat kohli, Rohit Sharma, Team India Bowling line-up, 5 seamers, 3 spinners, Jasprit Bumrah, Bhiuvaneswar kumar, Kuldeep Yadav, Cricket news, sports news, Cricket, sports

Former Indian opening batsman Gautam Gambhir will be honoured by naming a stand at the Arun Jaitley stadium which was formerly known as the Feroz Shah Kotla in Delhi. Gambhir has had very important contributions to Indian cricket and will always be remembered for his contributions.

కోహ్లీ తరువాత గంభీర్ కు అరుదైన గౌరవం..

Posted: 11/21/2019 09:41 PM IST
After virat kohli now ddca is set to honour gautam gambhir with a stand

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. తన అద్బుత ప్రదర్శనలతో భారత క్రికెట్ జట్టుకు ఎన్నో మరువలేని విజయాలను అందించాడు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా కూడా కొనసాగుతున్న ఆయన ఆటను ఇన్నాళ్లకు గుర్తించిన ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్.. ఆయనకు ఆరుదైన గౌరవాన్ని అందించాలని నిర్ణయించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తరువాత ఈ అరుదైన ఘనతను అందుకోబొతున్న మాజీ క్రికెటర్ గౌతముడే కావడం విశేషం.

ఇంతకీ ఆ గౌరవం ఏంటంటే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (అంతకుముందు ఫిరోజ్ షా కోట్ల మైదానం) స్టేడియంలోని ఓ స్టాండుకు గౌతమ్ గంభీర్ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు తాజాగా దిల్లీ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) నిర్ణయించింది. ఇప్పటికే ఈ స్టేడియంలోని ఓ స్టాండ్‌కి టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పేరు పెట్టారు. కోహ్లీ గౌరవార్థం ఈ ఏడాది సెప్టెంబరులో దీనికి సంబంధించిన వేడుక కూడా నిర్వహించారు. తాజగా గంభీర్ కు కూడా అటువంటి గౌరవమే లభించనుంది.

దీనిపై డీడీసీఏ సంయుక్త కార్యదర్శి రాజన్‌ మంచండా మాట్లాడాతూ.. టీమిండియాకు గౌతమ్‌ గంభీర్‌ చేసిన సేవలకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేయాలని భావిస్తున్నామని చెప్పారు. ఇందుకు డిడీసీఏ కౌన్సిల్‌ కూడా పచ్చజెండా ఊపిందని తెలిపారు. నిజానికి స్టాండ్‌కి గంభీర్‌ పేరు పెట్టాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉందని.. కాకపోతే దానికి కాస్త విరామం వచ్చిందని.. ఇప్పుడు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే రంజీట్రోఫీ సీజన్‌ నుంచే ఈ స్టాండ్‌ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

టీమిండియాలో తిరుగులేని ఓపెనర్ గా రాణించిన గంభీర్ గతేడాది క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగారు. తర్వాత బీజేపి పార్టీలో చేరి రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈస్ట్‌ ఢిల్లీకి ఎంపీగా ఉన్నారు. తాను ఆటలో వున్నా లేకున్నా.. నిత్యం టీమిండియా క్రికెట్ పై తన స్పందనను తెలియజేస్తూ.. తన ఆనందాన్ని, ఆవేదనను పంచుకుంటున్న గంభీర్.. ఇటీవలే విరాట్ కోహ్లీ సేనకు పరిపూర్ణ బౌలింగ్‌ విభాగం ఉందని అభిప్రాయపడిన విషయం తెలిసిందే. టీమిండియా ఇటీవల మ్యాచులలో ప్రత్యర్థి జట్టును అలౌట్ చేయడానికి కూడా కారణమిదేనని పేర్కొన్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles