Sourav Ganguly set to become new BCCI President బిసిసిఐ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్న మాజీ కెప్టెన్

Ex india captain sourav ganguly all set to be president of bcci

srinivasan bcci, Sourav Ganguly BCCI, sourav ganguly, sourav bcci, india national cricket team, Brijesh Patel, bcci president, bcci, Sourav Ganguly, BCCI, Team India, Cricket board, President, Brijesh Patel, sports news, sports, cricket news, Cricket

The stage is set for former India captain Sourav Ganguly to be the next president of the Indian cricket board (BCCI), with elections unlikely to be held at BCCI's Annual General Meeting on October 23.

బిసిసిఐ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్న మాజీ కెప్టెన్

Posted: 10/14/2019 09:58 AM IST
Ex india captain sourav ganguly all set to be president of bcci

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా దాదాపుగా ఖాయమైనట్టే. నాటకీయ పరిణామాల మధ్య గంగూలీ అందరికీ ఆమోదయోగ్యుడిగా నిలిచినట్లు తెలుస్తోంది. హోంమంత్రి అమిత్‌ షా తనయుడు జై షా కార్యదర్శిగా, తాజామాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్‌ ధూమల్‌ కోశాధికారిగా కూడా ఎన్నికవడం కూడా ఖరారైనట్లేనని తాజాగా అందుతున్న వార్తలు స్పష్టం చేస్తున్నాయి.

నామినేషన్లకు ఇవాలే ఆఖరు తేదీ కావడంతో ఈ సాయంత్రానికి ఈ విషయమై మరింత క్లారిటీ రానుంది. 47 ఏళ్ల గంగూలీ ప్రస్తుతం బంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు. బీసీసీఐ అధ్యక్షుడైతే.. తప్పనిసరి విరామ నిబంధన వల్ల 2020 సెప్టెంబరులో అతడు ఆ పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ముంబైలో సమావేశమైన బీసీసీఐ రాష్ట్ర సంఘాల ప్రతినిధులు  కీలక పదవుల్లో ఎవరుండాలన్నదానిపై వారి మధ్య చర్చ జోరుగా సాగింది. ముఖ్యంగా సౌరభ్‌ గంగూలీ, బ్రిజేష్‌ పటేల్‌ల మధ్య అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా నడిచింది.

ఈ పోటీలలో మొదట శ్రీనివాసన్‌ సన్నిహితుడు బ్రిజేష్‌ పటేల్‌ అధ్యక్ష రేసులో ముందు నిలిచాడు. గంగూలీకి ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని భావించారు. అందుకు గంగూలీ తిరస్కరించాడట. అధ్యక్షుడిగా బ్రిజేష్‌ అభ్యర్థిత్వాన్ని ఎక్కువ రాష్ట్ర సంఘాలు కూడా వ్యతిరేకించినట్లు సమాచారం. ఆఖరికి గంగూలీకి బోర్డు అధ్యక్ష పదవి కట్టబెట్టి.. బ్రిజేష్‌కు ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని సభ్యులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే బిజేష్‌ ఇంకా అధ్యక్ష పోటీలోనే ఉన్నాడని కూడా బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sourav Ganguly  BCCI  Team India  Cricket board  President  Brijesh Patel  sports  Cricket  

Other Articles

 • Icc odi rankings 2019 virat kohli jasprit bumrah retain top spots in icc batting and bowling rankings

  ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అధిపత్యం చాటిన టీమిండియా

  Nov 12 | అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు టాప్ ప్లేస్ ను ఆక్రమించుకున్నారు.  ఇవాళ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో... Read more

 • Smriti mandhana first fastest woman cricketer to score 2000 odi runs

  2వేల మైలురాయిని అందుకున్న మూడో మహిళా క్రికెటర్..

  Nov 07 | మహిళల వన్డే క్రికెట్లో వేగంగా రెండువేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్ గా స్మృతి మంధాన రికార్డు నమోదు చేసింది. వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో మంధాన 74 పరుగులు చేసింది.... Read more

 • Nirdesh baisoya emulates anil kumble s feat in u 16 match

  దిగ్గజం గణంకాలను దింపేసిన యువ స్పిన్నర్

  Nov 07 | అంతర్జాతీయ క్రికెట్ లో భారత దిగ్గజ స్పిన్నర్ అనీల్ కుంబ్లే నమోదు చేసిన గణంకాలను దేశవాళీ క్రికెట్ లో అందుకున్నాడు ఓ యువకెరటం. మేఘాలయకు చెందిన యువ ఆఫ్ స్పిన్నర్ నిర్దేశ్ బైసోయా అసాధారణ... Read more

 • Icc t20 world cup 2020 live icc announces schedule venues timing and streaming details

  ఐసీసీ టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. వేదికలు ఇవే..

  Nov 04 | ఐసీసీ టీ 20 ప్రపంచకప్ కొత్త ఫార్మాట్లో జరగనుంది. మొత్తం 16 దేశాలు పోటీపడనున్న ఈ మెగా టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు జరగనుంది. ఈ... Read more

 • 15 players instead of 11 bcci s power player could change t20 cricket forever

  2020 ఐపీఎల్ లో ‘పవర్ ప్లేయర్’ నిబంధన

  Nov 04 | అభిమానులను ఉర్రూత లూగించే ఐపీఎల్ క్రికెట్ ఫార్మాట్ ను మరింత రసవత్తరం చేసేందుకు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) యోచిస్తోంది. కొత్తగా ఆటగాళ్లకు సంబంధించి ‘పవర్ ప్లేయర్’ విధానాన్ని అమల్లోకి తేవాలనుకుంటోంది. ఇందులో... Read more

Today on Telugu Wishesh