Kohli equals Dhoni, achieves 2 more Test records కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత.. తొలి కెప్టెన్..

Virat kohli betters ms dhoni record with 30 wins in 50 tests as captain

virat kohli, virat kohli india vs south africa, india vs south africa 2nd test, pune test ind vs sa, virat kohli test captaincy, virat kohli sourav ganguly, virat kohli mahendra singh dhoni, virat kohli vs ms dhoni, rishabh pant, MS Dhoni cricket news, sports news, sports, cricket

India captain Virat Kohli registered his 30th win till 50th Test as India outclassed South Africa by innings and 137 runs in Pune Test to take 2-0 unbeatable lead in the 3-match series.

మిస్టర్ కూల్ ధోనీ రికార్డును సమం చేసిన విరాటుడు..!

Posted: 10/14/2019 11:54 AM IST
Virat kohli betters ms dhoni record with 30 wins in 50 tests as captain

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో టీమిండియా స్వదేశంలో అత్యధికంగా 11 టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకొని మరే జట్టుకు సాధ్యంకాని చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ఇదివరకు స్వదేశంలో వరుసగా పది టెస్టు సిరీస్‌లు గెలుపొందగా కోహ్లీ సారథ్యంలోని భారత్‌.. దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో విజయం సాధించి ఆ రికార్డును అధిగమించింది.

ఇదిలా ఉండగా కోహ్లీ కెప్టెన్సీలోనే భారత జట్టు మరో రికార్డు చేరుకుంది. ఎనిమిదిసార్లు ఇన్నింగ్స్‌ తేడాతో విజయాలను అందించిన విరాట్‌..  గంగూలీ, అజహరుద్దీన్‌లను వెనక్కి నెట్టాడు. వీరిద్దరూ గతంలో భారత్‌ను చెరో 7సార్లు ఇలా గెలిపించారు. ఇక కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఇన్నింగ్స్‌ పరుగుల తేడాతో విజయాలు నమోదు చేయడంతో అతడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ మరోసారి టీమిండియాను ఇన్నింగ్స్‌ పరుగుల తేడాతో గెలిపిస్తే ధోనీ రికార్డును సైతం బద్దలు కొడతాడు.

ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికాపై ఆదివారం సాధించిన విజయమే టెస్టుల్లో భారత్‌కు అత్యధిక ఇన్నింగ్స్‌ పరుగుల తేడా విజయం. కోల్‌కతా వేదికగా 2010లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఇన్నింగ్స్‌ 57 పరుగులతో గెలుపొందింది. ధోనీ తర్వాత టీమిండియా బాధ్యతలు తీసుకున్న కోహ్లీ స్వదేశంలో ఎనిమిది టెస్టులకు నాయకత్వం వహించి అన్నిట్లో జట్టును గెలిపించాడు. ఇప్పటికే విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ మొత్తంగా 50 టెస్టులకు సారథ్యం వహించి 30 మ్యాచ్‌ల్లో జట్టును విజయపథంలో నడిపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  india vs south africa  pune 2nd test  saurav ganguly  MS Dhoni  cricket  sports  

Other Articles