India Lose by Not Playing Pak, Says Gavaskar పాక్ ను ఓడించాలి.. వరల్డ్ కప్ అడకపోతే నష్టమే..

India lose by not playing pakistan in icc world cup 2019 says sunil gavaskar

sunil gavaskar, sunil gavaskar india, imran khan, india vs pakistan, ind vs pak, ind vs pak world cup, pulwama terror attack, sports news, sports, cricket news, cricket

Amidst the growing clamour for a boycott of all cricketing ties with the arch-rivals, Sunil Gavaskar stated that India can in turn hurt them them more by beating them and ensuring that they are dumping out of the global event.

పాక్ ను ఓడించాలి.. వరల్డ్ కప్ అడకపోతే నష్టమే..

Posted: 02/21/2019 06:42 PM IST
India lose by not playing pakistan in icc world cup 2019 says sunil gavaskar

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో రానున్న క్రికెట్ ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో ఆడకూడదనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన శత్రుదేశమైన పాకిస్థాన్ తో ఆడి, వారిని చిత్తుగా ఓడించాలని అన్నారు. ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకపోతే నష్టం భారత దేశానికే కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పాక్ ను ఏకంగా వరల్డ్ కప్ నుంచే తప్పించాలన్న డిమాండ్ సాధ్యం కాకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు.

ఆ ప్రతిపాదనను ఇతర దేశాలు అంగీకరించకపోవచ్చని తెలిపారు. రెండు దేశాల మధ్య సమస్యలోకి... తమను లాగవద్దని చెప్పే అవకాశం ఉందని చెప్పారు. ఇక వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఆడకపోతే మనం రెండు పాయింట్లు కోల్పోతామని గవాస్కర్ చెప్పారు. పాక్ తో మనం మ్యాచ్ ఆడకపోతే అది ఆ దేశంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని... ఇదే సమయంలో ప్రపంచకప్ లాంటి టోర్నమెంట్ లో రెండు పాయింట్లను కోల్పోవడమంటే చిన్న విషయం కాదని... టోర్నమెంట్ నుంచి బాధతో నిష్క్ర్రమించే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు.

పాక్ తో మనం ఆడి, ఆ జట్టు సెమీస్ కు చేరకుండా నిలువరించాలని చెప్పారు. పాకిస్థాన్ తో ఆడకున్నా... నాకౌట్ కు క్వాలిఫై కాగల సత్తా టీమిండియాకు ఉందనే విషయం తనకు తెలుసని తెలిపారు. నయా పాకిస్థాన్ ను నిర్మిస్తానన్న తన మిత్రుడు, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందు మంచి అవకాశం ఉందని సునీల్ గవాస్కర్ చెప్పారు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఇమ్రాన్ ఒక స్నేహపూర్వక అడుగు వేయాలని... దీనికి ప్రతిస్పందనగా భారత్ మరెన్ని అడుగులు వేస్తుందో చూడాలని తెలిపారు.

పుల్వామా ఉగ్రదాడికి బాధ్యుడైన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను ఐక్యరాజ్యసమితికి కానీ, భారత్ కు కానీ ఇమ్రాన్ అప్పగించాలని చెప్పారు. ఏదైనా మాటల్లో ఉండరాదని, చేతల్లో ఉండాలని అన్నారు. టెర్రరిజాన్ని అంతం చేసే దిశగా పని చేయాలని... నయా పాకిస్థాన్ ను నిర్మించుకోవాలని తన మిత్రుడుని కోరుతున్నానని చెప్పారు. లేకపోతే పాకిస్థాన్ ఎప్పటికీ భారత్ వ్యతిరేకిగానే మిగిలిపోతుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunil gavaskar  imran khan  india vs pakistan  world cup  pulwama terror attack  cricket  

Other Articles