'He is finished,' MS Dhoni trolled on Twitter ధోనిపై మళ్లీ విమర్శలతో విరుచుకుపడిన నెట్ జనులు

Ms dhoni trolled on twitter after india goes down fighting

India vs Australia T20, india national cricket team, ind vs aus T20, twitterites, Ind vs Aus, Australia national cricket team, T20 Series, Team India, Virat Kohli, MS Dhoni, Shikhar Dhawan, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

The first T20 International between India and Australia played at Vizag turned out to be a cracker of a match with Australia winning the game on the last ball to beat India by 3 wickets in a nail biting finish.

ధోనిపై మళ్లీ విమర్శలతో విరుచుకుపడిన నెట్ జనులు

Posted: 02/25/2019 05:23 PM IST
Ms dhoni trolled on twitter after india goes down fighting

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి మ్యాచ్ ఫినిషర్ గా మంచి పేరుంది. ఆయన దాదాపుగా అటు వన్డేల్లోనూ, ఇటు టీ20ల్లోనూ అనేక మ్యాచులను చివరి ఓబర్లలో ఉత్కంఠకర పోరులో గెలిపించిన క్రీకెటర్. అయినా గత కొంతకాలంగా పేలవమైన ప్రదర్శనతో అకట్టుకోలేకపోయిన ధోనిపై విమర్శలు వచ్చాయి. దీంతో తానెంటో.. తన సత్తా ఏంటో ఇటీవల అసీస్ గడ్డపైన, కివీస్ గడ్డపైనా చూపించాడు ధోని. దీంతో విమర్శలకు బ్రేకులు పడినా అది కొంతకాలానికి మాత్రమే పరిమితమయ్యింది. క్రితం రోజు తనకు అచ్చొచ్చిన విశాఖ వేదికలో పరుగులు చేయకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో పరుగులు చేయలేదని, భారీ షాట్లు ఆడలేదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఆసీస్‌తో మ్యాచ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (50; 36 బంతుల్లో 6×4, 1×6) అర్ధశతకం సాధించాడు. కోహ్లీ, రాహుల్‌ ఉన్నంత వరకు పటిష్ఠ స్థితిలో ఉన్న టీమిండియా ఒక్కసారిగా 94/5తో ఒత్తిడిలోకి జారిపోయింది. రిషభ్‌ పంత్‌ నిష్ర్కమణతో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ అతడు 37 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 29 పరుగులే చేశాడు.

ఆసీస్‌ బౌలింగ్‌ ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. భారీ షాట్లకు ప్రయత్నించలేదు. ఛేదనలో ఆసీస్‌ ఆఖరి బంతికి విజయం అందుకుంది. పరుగులు చేయకపోవడంతో ధోనీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘తను మాత్రమే బ్యాటింగ్‌ చేస్తానని ధోనీ అనుకుంటున్నాడా? అవతలి వారికి స్ట్రైక్‌‌ ఇవ్వలేదు. ఆయనా పరుగులు చేయలేదు. ఇది మంచిది కాదు’, ‘పాత జ్ఞాపకాలు చెరిపేయకు. దయచేసి రిటైర్‌ అవ్వు’, ‘పరుగెత్తకుండా 10+ సింగిల్స్‌ తీయలేదు. అటు హిట్టింగూ చేయలేదు’, ‘ఎంఎస్ ధోనీ గెలుపు కోసం ఆడే వ్యక్తి.  కొన్ని సార్లు భారత్‌ కోసం, మరికొన్ని సార్లు ప్రత్యర్థుల కోసం’ అంటూ ట్విటర్లో నెటిజన్లు వ్యంగ్య బాణాలు విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  T20 Series  Team India  MS Dhoni  Twitterites  sports  cricket  

Other Articles