Ind vs Nz 4th odi: New Zealand beat India by 8 wickets టీమిండియా.. 7వ అత్యల్ప స్కోరు నమోదు

India vs new zealand 4th odi india record their seventh lowest odi total

India vs New Zealand, india national cricket team, ind vs aus odi, Ind vs Nz live score, Ind vs Nz, New Zealand national cricket team, ODI Series, Team India, Virat Kohli, MS Dhoni, Kedar Jadhav, Yazuvendra chahal, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India suffered a batting collapse on Thursday as they were bowled out for 92 in the fourth ODI against New Zealand at Seddon Park in Hamilton.

ఆశలను చిదిమేసిన టీమిండియా.. 7వ అత్యల్ప స్కోరు నమోదు

Posted: 01/31/2019 12:05 PM IST
India vs new zealand 4th odi india record their seventh lowest odi total

ఆసీస్ తరువాత కివీస్ పై కూడా చరిత్రను తిరగరాస్తారని కోటి ఆశలతో ఎదరుచూసిన టీమిండియా అభిమానులకు మెన్ ఇన్ బ్లూ నిరాశనే మిగిల్చారు. న్యూజీలాండ్ గడ్డపై 52 ఏళ్ల సుదీర్గ చరిత్రను తిరగరాసే అవకాశాన్ని చేజేతులా కోల్పోయారు. అసీస్ పర్యటనతో పాటు కివీస్ గడ్డపై జరిగిన మూడు వన్డేలలో సమష్టిగా రాణించిన టీమిండియా బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు.. సీరీస్ చేతికందగానే చతికిలపడిపోయారు.

హామిల్టన్ వేదికగా జరగనున్న నాలుగో వన్డేలో గెలిచి ఐదు దశాబ్దాల రికార్డును తిరగరాస్తారని ఎదురుచూసిన టీమిండియా అభిమానులకు నిరాశ మిగిలింది. అంతేకాదు గత ఎనమిదేళ్లలో ఎన్నడూ లేనట్టుగా మరోమారు కేవలం వంద పరుగులలోపే (కేవలం 92) స్కోరునే నమోదు చేసి చెత్త రికార్డును మూటగట్టుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

న్యూజీలాండ్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (5/21), గ్రాండ్‌హోమ్ (3/26) ధాటికి భారత బాట్స్ మెన్లు వరుసగా వికెట్లు సమర్పించుకుని కేవలం 30.5 ఓవర్లకే చాపచుట్టేశారు. టీమిండియా బ్యాట్స్ మెన్లతో మొత్తంగా ఏడుగురు ఇవాళ జరిగిన మ్యాచులో సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమయ్యారు. ట్రెంట్ బౌల్ట్ వరుస ఓవర్లలో భారత్ ఓపెనర్లు శిఖర్ ధావన్ (13: 20 బంతుల్లో 1x4, 1x6), రోహిత్ శర్మ (7: 23 బంతుల్లో) వికెట్లను పడగొట్టాడు. దీంతో.. ఒత్తిడికి గురైన అంబటి రాయుడు (0), దినేశ్ కార్తీక్ (0) ఒకే ఓవర్‌లో గ్రాండ్‌హోమ్‌కి వికెట్లు సమర్పించుకోగా.. కోహ్లీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న అరంగేట్రం బ్యాట్స్‌మెన్ శుభమన్ గిల్ (9: 21 బంతుల్లో 1x4) కూడా నిరాశపరిచాడు.

ఈ దశలో ఆదుకుంటారని ఆశించిన కేదార్ జాదవ్ (1: 7 బంతుల్లో), హార్దిక్ పాండ్య (16: 20 బంతుల్లో 4x4) చేతులెత్తేయగా.. భువనేశ్వర్ (1: 12 బంతుల్లో) ఫెయిలయ్యాడు. అయితే.. ఆఖర్లో కుల్దీప్ యాదవ్ (15: 33 బంతుల్లో 1x4), చాహల్ జోడీ కాసేపు కివీస్ బౌలర్లకి ఎదురునిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. అనంతరం 93 పరుగలు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్.. దూకుడుగా ఆడటంతో 8 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలిచింది. రాస్ టేలర్ (37), హెన్రీ నికోలస్ (30)లతో రాణించి టీమిండియాపై విజయాన్ని నమోదు చేశారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. తొడ కండరాల గాయం కారణంగా మహేంద్రసింగ్ ధోనీ ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విజయంతో న్యూజిలాండ్ ఎట్టకేలకి భారత్ ఆధిక్యాన్ని 1-3కి తగ్గించింది. ఇక సిరీస్‌లో మిగిలిన ఆఖరి వన్డే ఆదివారం ఉదయం 7.30 గంటలకి హామిల్టన్ వేదికగా జరగనుంది. ఇదిలావుండగా, 2010 తర్వాత భారత్ జట్టు 100 పరుగులలోపే వన్డేలో కుప్పకూలడం ఇదే తొలిసారి. కాగా.. అప్పుడూ న్యూజిలాండ్ చేతిలోనే ఈ పరాభవాన్ని చవిచూసింది. సుదీర్ఘ వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు తక్కువ స్కోరుకి ఆలౌటైన మ్యాచ్‌లను ఓసారి పరిశీలిస్తే..!

1. శ్రీలంకతో 2000లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 54 పరుగులకే ఆలౌటైంది.
2. ఆస్ట్రేలియాతో 1981లో సిడ్నీ వేదికగా జరిగిన వన్డేలో 63కే ఆలౌటైంది.
3. శ్రీలంకతో 1986లో కాన్పు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 78కి కుప్పకూలింది.
4. పాకిస్థాన్‌తో 1978లో సైల్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 79కి ఆలౌట్
5. న్యూజిలాండ్‌తో 2010లో దంబుల్లా వేదికగా జరిగిన వన్డేలో 88 పరుగులకి ఆలౌట్
6. దక్షిణాఫ్రికాతో 2006లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 91కి ఆలౌట్
7. ఆస్ట్రేలియాతో 2000లో సిడ్నీ వేదికగా జరిగిన వన్డేలో 100 పరుగులకి ఆలౌట్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  ODI Series  Team India  Virat Kohli  sports  cricket  

Other Articles