4th ODI: India eye biggest series win on New Zealand soil ఇక కివీస్ గడ్డపై.. చరిత్ర సృష్టించేందుకు టీమిండియా రెడీ..

The men in blue are gunning for their biggest series win across formats in new zealand

India vs New Zealand, india national cricket team, ind vs aus odi, Ind vs Nz live score, Ind vs Nz, New Zealand national cricket team, ODI Series, Team India, Virat Kohli, MS Dhoni, Kedar Jadhav, Yazuvendra chahal, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Rohit Sharma will be eager to make his 200th appearance for India a memorable one with a solid performance against New Zealand in the fourth ODI. A 4-0 lead will be India's biggest series win (across formats) in their 52 years of touring New Zealand having first visited the country back in 1967.

ఇక కివీస్ గడ్డపై.. చరిత్ర సృష్టించేందుకు టీమిండియా రెడీ..

Posted: 01/30/2019 09:03 PM IST
The men in blue are gunning for their biggest series win across formats in new zealand

అస్ట్రేలియా గడ్డపై చరిత్రను సృష్టించిన టీమిండియా మరో రికార్డును తిరగరాసేందుకు సన్నధం అవుతోంది. దశాబ్దాల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కంగారులను ఓడించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని విజయగర్వంతో దూసుకుపోతున్న విరాట్ సేన.. ఇక న్యూజీలాండ్ గడ్డపై కూడా 52 ఏళ్ల చరిత్రను తిరగరాసే పనిలో నిమగ్నమైంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డేల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా చరిత్రలో మరో పుటను లిఖించేందుకు అడుగు దూరంలో నిలిచింది.

టీమిండియా జట్టు బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణిస్తుండటంతో రెండు వన్డేలు మిగిలి ఉండగానే ఐదు వన్డేల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకున్న విరాట్ సేన గురువారం ఉదయం 7.30 గంటల నుంచి హామిల్టన్ వేదికగా జరగనున్న నాలుగో వన్డేలో గెలిస్తే..? ఐదు దశాబ్దాల రికార్డును తిరగరాసినట్లే. 1967 నుంచి ఆ గడ్డపై పర్యటిస్తున్న భారత్ జట్టు చరిత్రలో ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో విజయాన్ని అందుకుంది. ఇది 2008-09 అప్పటి టీమిండియా జట్టు సాధించిన రికార్డు.

దీంతో.. నాలుగో వన్డేలో భారత్ గెలిస్తే ఆ గడ్డపై 4-0 గెలుపు అత్యుత్తమం కానుంది. ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ జట్టు టెస్టు సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ నేపథ్యంలో.. చివరి రెండు వన్డేల నుంచి కెప్టెన్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా అతని స్థానంలో రోహిత్ శర్మ జట్టు పగ్గాలను అందుకోబోతున్నాడు. దీంతో.. జట్టు బలం కొంచెం తగ్గనున్నా.. తొడ కండరాల గాయంతో మూడో వన్డేకి దూరమైన ధోనీ రేపు మళ్లీ టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తుండటంతో సమతూకం రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  Australia  ODI Series  Team India  Virat Kohli  sports  cricket  

Other Articles