Icc advice on MS Dhoni stumping, wins hearts of Twitterati ధోనిపై ఐసీసీ ట్వీట్.. ఫాన్స్ హృదయాలను గెలిచింది

Don t leave your crease when ms dhoni is behind icc s tweet wins hearts

India vs New Zealand, ODI Series, ICC, MS Dhoni, Kedar Jadhav, James Neesham, dhoni run out, dhoni james neesham, dhoni icc advice, dhoni stump out, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

MS Dhoni ran James Neesham out in the 5th ODI match of the series which won the hearts of people all over the globe and the people took to Twitter to applaud the wicketkeeper-batsman.

ధోనిపై ఐసీసీ ట్వీట్.. ఫాన్స్ హృదయాలను గెలిచింది

Posted: 02/04/2019 09:57 PM IST
Don t leave your crease when ms dhoni is behind icc s tweet wins hearts

వయసు పెరుగుతున్నా టీమిండియా లెజెండరీ క్రికెటర్ ధోనీలో చురుకుదనం ఏ మాత్రం తగ్గడం లేదు. వికెట్ కీపర్ గా ధోనీ చేస్తున్న కళ్లు చెదిరే డిస్మిసల్స్ చూస్తే 'వారెవ్వా' అనాల్సిందే. ఈ నేపథ్యంలో అన్ని జట్ల బ్యాట్స్ మెన్ కు ఐసీసీ కీలక సూచన చేసింది. 'వికెట్ల వెనుక ధోనీ ఉన్నప్పుడు... క్రీజు దాటి ముందుకు వచ్చే ప్రయత్నం చేయకండి' అని సూచించింది.

న్యూజిలాండ్ తో నిన్న జరిగిన చివరి వన్డేలో ధోనీ మెరుపు వేగానికి కివీస్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 44 పరుగులతో అప్పటికే నీషమ్ క్రీజులో పాతుకుపోయాడు. కేదార్ జాధవ్ వేసిన బంతిని నీషమ్ మిస్ అయ్యాడు. అయితే, ఆ బంతి నీషమ్ కాలికి తాకడంతో భారత్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశారు. ఇదే సమయంలో నీషమ్ క్రీజు బయటకు వచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంతిని అందుకున్న ధోనీ... వికెట్లను గిరాటేశాడు. ఏం జరిగిందో అర్థం కాని స్థితిలో నీషమ్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో ధోనీని ఎదుర్కోవడం ఎలా అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ఐసీసీ సలహా అడిగాడు. ఈ ట్వీట్ పై స్పందించిన ఐసీసీ... ధోనీ వికెట్ల వెనుక ఉన్నప్పుడు... క్రీజును వదిలి వెళ్లవద్దంటూ సూచించింది. అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ ఇప్పటి వరకు 190 స్టంపింగ్ లు చేశాడు. అతని దరిదాపుల్లో కూడా మరెవరూ లేరు. ధోనీ తర్వాత శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (139 స్టంపింగ్ లు) ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  ODI Series  ICC  MS Dhoni  Kedar Jadhav  James Neesham  sports  cricket  

Other Articles