Rohit out, Kuldeep in for India Test squad టెస్టు జట్టు ప్రకటన.. రోహిత్ ఔట్.. కుల్దీప్ ఇన్..

India s test squad announced for three matches

rohit sharma, kuldeep yadav, rishabh pant, wriddiman saha, bcci, virat kohli, Bhuvneshwar Kumar, Cricket,Dinesh Karthik,England,England vs India 2018,India,India vs England,India vs England 2018,India's Test squad,India's Test team,Indian Premier League,Jasprit Bumrah,KL Rahul,Kuldeep Yadav,Shikhar Dhawan,Test cricket,Virat Kohli cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

TeamIndia opener Rohit Sharma has been overlooked and star fast bowler Bhuvneshwar Kumar has been ruled out with injury as India name their Test squad to face England. Kuldeep Yadav has been added into the squad who could form a potent three-pronged spin attack with Ravi Ashwin and Ravindra Jadeja.

మూడు టెస్టులకు జట్టు ప్రకటన.. రోహిత్ ఔట్.. కుల్దీప్ ఇన్..

Posted: 07/18/2018 05:24 PM IST
India s test squad announced for three matches

ఇంగ్లాండ్ తో జరిగిన రెండు పరిమిత ఓవర్ల సిరీస్ లలో ఒకదానిలో గెలిచి మరోటి ఓటమిపాలైన నేపథ్యంలో బిసిసిఐ అచితూచి అత్యంత కీలకమైన టెస్టు సిరీస్ కు మాత్రం ఆటగాళ్ల ఎంపికలో తీవ్ర కసరత్తే చేసింది. ఇవాళ ఇంగ్లాండ్ తో తలపడే టెస్టు స్వాడ్ ను ప్రకటించిన బీసీసీఐ.. టీ20లలో పంబరేపి.. వన్డేలో చతికిలపడిన రోహిత్ శర్మను పక్కనబెట్టింది. గతంలో కూడా రోహిత్ శర్మ టెస్టుల్లో పెద్దగా రాణించకపోవడంతో.. బీసిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా రిషబ్ పంత్ కు తొలిసారిగా టెస్టు మ్యాచ్ లలో పిలుపు అందింది.

ఆగస్టు 1 నుంచి టీమిండియా‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి మూడు టెస్టుల్లో తలపడే టీమిండియాను బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. మొత్తం 18 మంది సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. యో యో టెస్టు ఫెయిలై అఫ్గానిస్థాన్ తో ఏకైక టెస్టుకు దూరమైన మహమ్మద్‌ షమి ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం నుంచి కోలుకోని సాహాకు చోటు దక్కలేదు. అలాగే వెన్నునొప్పితో బాధపడుతోన్న భువనేశ్వర్‌ కూడా మూడు టెస్టులకు దూరమయ్యాడు. వికెట్‌ కీపర్లుగా దినేశ్‌ కార్తీక్‌, రిషప్‌ పంత్‌కు చోటు దక్కింది.

తన మాయాజాలంతో ప్రత్యర్థుల వికెట్లను తన ఖాతాలోకి వేసుకుంటూ టీ20, వన్డే సిరీస్ లో రాణించిన మణికట్టు స్పిన్నర్‌ కుల్ దీప్‌ యాదవ్‌ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. అయితే మొత్తంగా 18 మంది పేర్లను బిసిసిఐ ప్రకటించినా.. తుది జట్టులో అడే 11 మంది ఎవరన్నది.. తెలుసుకోవాలంటూ వేచి చూడాల్సిందే. వన్డే సిరీస్ కోల్పోయిన ఇండియా టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుని చరిత్రను తిరగరాస్తూ ఇంటికి చేరుకుంటుందని భారత క్రీడాభిమానులు భావిస్తున్నారు.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, ఛటేశ్వర్ పుజారా, రహానె(వైస్‌ కెప్టెన్‌), కరుణ్‌ నాయర్‌, దినేశ్‌కార్తీక్‌(వికెట్‌ కీపర్‌), రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, ఇషాంత్‌ శర్మ, మహమ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : rohit sharma  kuldeep yadav  rishabh pant  wriddiman saha  bcci  virat kohli  sports  cricket  

Other Articles