MS Dhoni Bicycle Stunt Goes Viral నెట్టింట్లో వైరల్: ధోని సైకిల్ స్టంటు వీడియో..

Ms dhoni filmed performing bizarre cycling stunt

ms dhoni, ms dhoni bicycle stunt, ms dhoni cycle stunt, ms dhoni stunts, ms dhoni bicycle, ms dhoni cycling stunt, ms dhoni stunt, ms dhoni bicycle stunt video, ms dhoni amazing cycle stunt, ms dhoni cycle stunt video, dhoni bicycle stunt, ms dhoni latest videos, cricket news, indian cricket news, sports news, sports

Former India Cricket Captain MS Dhoni always makes headlines for his contribution both on and off the field. He has recently done a stunt on a Bicycle that has gone viral on social media.

నెట్టింట్లో వైరల్: ధోని సైకిల్ స్టంటు వీడియో..

Posted: 08/01/2018 07:01 PM IST
Ms dhoni filmed performing bizarre cycling stunt

మహేంద్రసింగ్ ధోని నిత్యం ఈ పేరు పత్రికలలో నానుతూనే వుంటుంది. ధోని క్రికెట్ గ్రౌండ్ లో వున్నా.. లేక బయటవున్నా.. ఆయన సాహసాలు, స్టంట్లు, కార్లు లేదా బైకులతో నిత్యం వార్తల్లో నానుతుంటాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనను ముంగించుకుని స్వదేశానికి వచ్చిన ఎంఎస్ ధోనీకి విరామం లభించడతో సమయాన్నంతా తన కుటుంబంతోనే గడుపుతున్నారు. జార్ఖండ్‌లోని తన ఇంట్లోనే భార్య సాక్షి, కూతురు జీవాలతో ఆనందంగా గడుపుతున్నాడు.

క్రికెట్ జీవితంతో పాటు అతనికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆయన అబిమానులు నిత్యం ఫాలో అవుతుంటారు. తన జీవితంలోనూ ఎప్పుడూ ఛాలెంజ్ లు కోరుకునే ఈ మాజీ కెప్టెన్ కూల్ స్కూభా డైవింగ్ వంటి సాహసాలను చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ధోని చేసిన ఓ  సైకిల్ స్టంట్ సోషల్ మీడిమాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోతో పాటు ధోని ఇచ్చిన సందేశంతో ధానిని ఫాలో అవుదామని అనుకుంటున్న అభిమానులకు అదేం స్టంటో మాత్రం అర్థం కాలేదు. ఎవరైనా చెప్పకపోతారా..? అనుకుంటూ ఈ స్టంట్ పేరోంటో తెలిస్తే చెప్పండీ అంటూ ఛాలెంజ్ విసరుతున్నారు.

అసలు ధోని ఏం స్టంటు చేశాడంటే.. సైకిల్ పై కూర్చోన్న ఆయన తన నోట్లో ఓ చెక్క ముక్క పెట్టుకుని, చెవులకు హెడ్ సెట్ పెట్టుకుని ఓ చిన్న సైకిల్ పై చుట్టూ పెద్దని ఐరన్ పైప్ ను చుతుర్భుజ అకారంలో వుండగా, తన కాళ్లను నేలకు తాకకుండా ఉంచి సైకిల్ ను ముందుకు పోనిస్తూ సాహసం చేశాడు. ఈ వీడియోను ధోనీ స్వయంగా తన ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సరదాగా ఈ సాహసం చేశాను, మీరు కూడా ఇళ్లలో దీన్ని ప్రయత్నించండి అంటూ వీడియోకు జతగా పోస్ట్ పెట్టాడు.

 

Just for fun, plz try it at home.

A post shared by M S Dhoni (@mahi7781) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  bicycle stunt  videos  viral videos  sports  cricket  

Other Articles