MS Dhoni to retire from ODIs soon? ధోని.. వన్డేలకు కూడా సెలవు ప్రకటిస్తున్నాడా.?

Is ms dhoni contemplating retirement from odi cricket

MS Dhoni, India, England, India tour of England 2018, India vs England, sports, Team India, England vs India, Dhoni retirement, bcci, cricket, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

MS Dhoni retirement: The hint from the wicketkeeper-batsman came when he asked the umpires for the match ball while players were walking off the field after India's bowling in the third ODI against England at Headingley.

ధోని.. వన్డేలకు కూడా సెలవు ప్రకటిస్తున్నాడా.?

Posted: 07/18/2018 03:51 PM IST
Is ms dhoni contemplating retirement from odi cricket

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ త్వరలోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడా.? రానున్న ప్రపంచ కప్ వరకు అడటానికి తాను అన్ని రకాలుగా ఫిట్ గా వున్నానని మాటల్లోనే కాక.. అటు యువ క్రీడాకారులతో సమానాంగా పరుగెత్తి చేతల్లోనూ సవాల్ విసిరన ధోని.. తాజాగా తనపై వస్తున్న విమర్శలకు తలొగ్గి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా.? అన్న అసక్తికర ప్రశ్నలు ఇప్పుడు టీమిండియా క్రికెట్ అభిమానులతో పాటు ధోని అభిమానులను కలవరపరుస్తున్నాయి.

ఇంగ్లాండ్ తో లీడ్స్ లో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో పరాజయం పాలవ్వడంతొ వన్డే సిరీస్ ను 2-1 తేడాతో అతిధ్యజట్టు సొంతం చేసుకుంది. కీలకమైన మ్యాచ్‌లో భారత్ పేలవ ప్రదర్శనతో నిరాశపర్చింది. పరుగులు చేయడంలో మిడిలార్డర్ మరోసారి విఫలం కాగా.. ధోనీ క్రీజులో నిలబడి పోరాడినా.. దూకుడుగా ఆడలేకపోయాడని అభిమానులు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను పక్కనబెడితే మ్యాచ్ ముగిసిన తరువాత ధోని అంపైర్ల నుంచి బంతిని తీసుకున్నాడు. దీంతో ధోనీ త్వరలోనే క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడనే రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.

అందుకు కారణం కూడా లేకపోలేదు. సరిగ్గా టెస్టుల నుంచి రిటైరయ్యే సమయంలోనూ ధోనీ ఇలాగే ప్రవర్తించాడు. 2014లో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ ఆడిన ధోనీ.. మ్యాచ్ ముగిశాక.. స్టంప్ లను తనతో తీసుకెళ్లాడు. ఆటగాళ్లు గెలిచిన ఆనందంలో లేదా గుర్తుగా మాత్రమే ఇలా స్టంప్ లను తీసుకెళ్తారు. ఆసీస్ తో మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ ధోనీ స్టంప్ లను తీసుకెళ్లాడు. తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ తో మ్యాచ్ ముగిశాక ధోనీ అంపైర్ దగ్గర్నుంచి బంతిని అడిగి తీసుకుంటోన్న వీడియో వైరల్‌గా మారింది. అభిమానులను కలవరపరిచే నిర్ణయాన్ని అప్పుడే ప్రకటించకపోతే మంచిదని అంటున్నారు అభిమానులు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles