Gambhir Advised Dhoni To Cut His Beard ధోని రంగు మార్చుకుంటే విమర్శలకు బ్రేక్..

Gautam gambhir responded on the white beard of ms dhoni

Gautam Gambhir, MS Dhoni, India, England, India tour of England 2018, India vs England, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Former Indian opener Gautam Gambhir wants MS Dhoni to get rid off his white beard as he is looking much older than actually, he is.

ధోని రంగు మార్చుకుంటే విమర్శలకు బ్రేక్..

Posted: 07/16/2018 06:37 PM IST
Gautam gambhir responded on the white beard of ms dhoni

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ ఓ సూచన చేశారు. ధోని రంగుమార్చుకుంటే విమర్శలకు బ్రేక్ పడుతుందని అన్నాడు. అదేంటి రంగుకు, విమర్శలకు లింక్ ఏంటీ అంటారా..? ప్రస్తుత ఇంగ్లాండ్‌ పర్యటనలో ధోనీ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. తెల్లటి గెడ్డంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఐతే, ధోనీ ఇలా గెడ్డంతో కనిపించడం నచ్చని గౌతమ్ గంభీర్ ధోనికి ఒక సూచన చేశాడు.

ధోని తన గడ్డం రంగు మార్చడం వల్ల 5నుంచి 10 సంవత్సరాలు పెద్దోడిలా కనిపిస్తున్నాడని గంభీర్‌ అన్నాడు. ధోనీ వీలైనంత త్వరగా తన గడ్డం రంగు మార్చుకోవాలని గంభీర్ సలహా ఇచ్చాడు. ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ... ‘ధోనీ తన కొత్త లుక్‌ కారణంగా చాలా పెద్ద వాడిలా కనబడుతున్నాడు. ఎవరో ఒకరు ఈ విషయాన్ని ధోనీకి చెప్పాలి. ఇంగ్లాండ్‌ పర్యటనలో ధోనీ తెల్లటి గెడ్డంతో ఆడుతున్నాడు. దీని వల్ల అతడు తన ప్రస్తుత వయసు కంటే ఐదు పదేళ్లు పెద్దోడిలా కనిపిస్తున్నాడు.

పలువురు యువ ఆటగాళ్లతో పోలిస్తే ధోనీ చాలా ఫిట్‌గా ఉన్నాడు. మైదానంలో చురుకుగా కదులుతాడు. కొత్త లుక్‌ కారణంగానే అతడు అలా కనిపిస్తున్నాడు. ధోనీ అలా కనపడకుండా ఉండాలంటే వెంటనే అతడు తన గెడ్డం రంగు మార్చుకోవాలి’ అని గౌతి అన్నాడు. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ధోనీ ఆటతీరుపై పెద్ద సంఖ్యలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వన్డేలో ఇంగ్లాండ్‌ గెలిచి సిరీస్ ను సమం చేసింది. ఇక చివరిదైన, నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautam Gambhir  MS Dhoni  India  England  India tour of England 2018  India vs England  sports  cricket  

Other Articles