"It's never too early to start" - Mithali Raj మిథాలీ రాజ్.. ప్రోత్సాహం.. ప్రశంసనీయం..

For soha ali khan s daughter inaaya special gift message from mithali raj

Mithali Raj, Soha Ali Khan, Inaaya, Kunal Kemmu, kunal kemmu soha ali khan daughter, Tiger Pataudi, twitter reactions, , cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

social media is obsessed these days with actors Soha Ali Khan and Kunal Kemmu's daughter Inaaya is one, as the little cute now the heart of ndia's star woman cricketer Mithali Raj.

మిథాలీ రాజ్.. ప్రోత్సాహం.. ప్రశంసనీయం..

Posted: 07/16/2018 05:54 PM IST
For soha ali khan s daughter inaaya special gift message from mithali raj

సందర్భమో.. అసందర్భమో.. లేక మరేదైనా కారణముందో తెలియదు కానీ.. ఏకంగా తాను వాడుతున్న బ్యాట్ పై ఒక చక్కని సందేశంతో పాటు తన అటోగ్రాఫ్ చేసి టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. అలనాటి మాజీ క్రికెటర్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ మనవరాలికి కానుకగా పంపారు. ఈ విషయాన్ని పటౌడీ కుమార్తె, బాలీవుడ్‌ నటి సోహా అలీ ఖాన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ బ్యాట్‌ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. బ్యాట్‌పై మిథాలీ ‘వయసు హద్దు కాదు..’ అని సందేశాన్ని రాసి తన ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు.

ఈ బ్యాట్‌ ఫొటోను సోహా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. తన అభిప్రాయాలను పంచుకుంది సోహా. అమె ఏం రాసిదంటే.. ‘ఇంతటి అపురూపమైన కానుకను నా కూతురు ఇనాయాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మిథాలీ. ఇనాయా త్వరగా ఎదిగి క్రికెట్‌ రంగంలోకి రావాలని ఎంతగానో ఎదురుచూస్తున్నా. అప్పటివరకు నువ్వు బాగా ఆడి భారత్ ను గర్వపడేలా చేయడం చూస్తుంటాం’ అని ట్వీట్‌ చేశారు. దీనికి మిథాలీ ప్రతిస్పందిస్తూ.. ‘ధన్యవాదాలు. ఇనాయా రక్తంలోనే క్రికెట్‌ ఉంది’ అని ట్వీట్‌ చేశారు.

అయితే ఏ సందర్భంలో మిథాలీ ఈ బ్యాట్‌ను ఇనాయాకు పంపారు అన్న విషయం మాత్రం తెలియరాలేదు. మన్సూర్‌ అలీ ఖాన్‌ 21ఏళ్ల వయసులో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్లలో ఆయన ఒకరు. మన్సూర్‌ కుమారుడు సైఫ్ అలీ ఖాన్‌ బాలీవుడ్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కుమార్తె సోహా అలీ ఖాన్‌ కూడా పలు చిత్రాల్లో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles