Virat Kohli explains why India picked Rohit over Rahane రోహిత్ ను అందుకనే తీసుకున్నారట..

Virat kohli explains why india picked rohit over rahane

India vs South Africa 2018,India vs South Africa, Virat Kohli, Rohit Sharma, Ajinkya Rahane, Jasprit Bumrah,Hashim Amla,Dean Elgar,Cricket news,Cape Town Test,Bhuvneshwar Kumar, sports news, sports, cricket news, cricket

India captain Virat Kohli defended the selection of Rohit Sharma in the opening Test against South Africa in Cape Town, saying Rohit was picked ahead of Ajinkya Rahane on current form.

రహానే బదులు రోహిత్ ను అందుకనే తీసుకున్నారటరహానే బదులు రోహిత్ ను అందుకనే తీసుకున్నారట....

Posted: 01/09/2018 06:40 PM IST
Virat kohli explains why india picked rohit over rahane

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో అజింక్యా రహానే బదులు మరో అటగాడిని తీసుకోవడానికి కారణాలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మీడియా ఎదుట వివరించాడు. అయితే అజ్యింక రహానే పేరు లేకపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. టెస్ట్ స్పెషలిస్ట్ అయిన రహానే స్థానంలో రోహిత్ శర్మను తీసుకోవడంపై కొందరు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రోహిత్ పై సెలక్టర్లు నమ్మకం ఉంచినప్పటికీ అతడు మాత్రం తొలి టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 11, రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేశాడు.
 
తొలి టెస్టులో 72 పరుగుల తేడాతో పరాజయం పాలైన తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ రోహిత్ శర్మను తీసుకోవడం వెనక ఉన్న కారణాన్ని బయటపెట్టాడు. కోహ్లీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ప్రస్తుతం ఉన్న ఫామ్ ను పరిగణనలోకి తీసుకుని రహానే బదులు రోహిత్ శర్మను తీసుకున్నట్టు చెప్పాడు. రోహిత్ ఇటీవల ఆడిన మూడు టెస్టుల్లోనూ అద్భుత ప్రతిభ కనబరిచాడని ప్రశంసించాడు. రోహిత్ చేసిన పరుగులను ప్రమాణంగా తీసుకునే అతడిని ఎంపిక చేశామని చెప్పుకొచ్చాడు.
 
నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికా టూర్‌లో రహానే బాగా రాణించాడు. 209 పరుగులతో ఆ టూర్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ 272, చతేశ్వర్ పుజారా 280 పరుగులు చేశారు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విధించిన 208 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా 72 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా ఒక్కడే 93 పరుగులతో ఆకట్టుకున్నా మరెవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  Virat Kohli  Rohit Sharma  Ajinkya Rahane  BCCI  cricket  

Other Articles