Philander: Being called 'unfit' motivated me కోహ్లీని మా ప్రణాళిక ప్రకారమే ఔట్ చేశాం: ఫిలాండర్..

Philander on kohli i always knew i had the one coming back

India vs South Africa 2018,India vs South Africa, Virat Kohli, Vernon Philander, South Africa cricket team, Jasprit Bumrah, India Cricket team, Bhuvneshwar Kumar, AB de Villiers, Cape Town Test, sports news, sports, cricket news, cricket

First Test man-of-the-match Vernon Philander says that suggestions last year that he was unfit motivated him to work harder behind the scenes.

కోహ్లీని మా ప్రణాళిక ప్రకారమే ఔట్ చేశాం: ఫిలాండర్..

Posted: 01/09/2018 07:24 PM IST
Philander on kohli i always knew i had the one coming back

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీని ప్రశాంతంగా ఉంచడమే తమ ప్రణాళిక అని రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను గెలిపించిన పేసర్‌ ఫిలాండర్‌ అన్నాడు. విరాట్ ను అనవసరంగా రెచ్చగొట్టలేదని అతడు దూకుడు పెంచకుండా ప్రణాళికను పక్కగా అమలు చేశామని పేర్కొన్నాడు. కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ 72 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

‘విరాట్‌ అద్భుతమైన ఆటగాడు. దూకుడుగా ఆడతాడు. అతడిని ప్రశాంతంగా ఉంచడమే మా ప్రణాళిక. ముందు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాది. ఆ తర్వాత విజయం సాధిస్తానని నాకు తెలుసు. కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయిన తర్వాత సమీక్షకు వెళ్లినప్పుడూ నేను ఆందోళన పడలేదు. అతడు కచ్చితంగా ఔటని తెలుసు’ అని కెరీర్‌లో 42/6తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఫిలాండర్‌ వెల్లడించాడు.

కోహ్లీ ఔటైనప్పుడు తాను అతడిని రెచ్చగొట్టలేదని ఓ ప్రశ్నకు ఫిలాండర్‌ సమాధానమిచ్చాడు. 208 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాల్సినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. అందుకే తాను వైవిధ్యమైన బంతులు విసిరానని తెలిపాడు. బంతి పాతది కావడం పిచ్‌ అనుకూలించడంతో అశ్విన్‌ బాగా ఆడాడన్నాడు. ‘ఆ సమయంలో అశ్విన్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. పిచ్‌ మందగించడంతో క్రీజు నుంచి ముందుకొచ్చి బంతిని ఎదుర్కొంటున్నాడు. బంతి కూడా పాతదైంది. అతడిని వెనక్కి ఆడేలా చేస్తే ఫలితం ఉంటుందని అనిపించింది. అదే చేశాను. దాంతో ఆ ఓవర్‌లో మూడు వికెట్లు దక్కాయి’ అని ఫిలాండర్‌ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  Virat Kohli  Vernon Philander  Dean Elgar  Bhuvneshwar Kumar  cricket  

Other Articles