South Africa beలt India by 72 runs in cape town test విరాట్ సేనను కుప్పకూల్చిన ఫిలాండర్..

India vs south africa 1st test south africa beat india by 72 runs to take 1 0 lead

India vs South Africa 2018,India vs South Africa,Virat Kohli,South Africa cricket team,Mohammed Shami,Jasprit Bumrah,India vs South Africa 2018,India Cricket team,Bhuvneshwar Kumar,AB de Villiers,Cape Town Test,Bhuvneshwar Kumar, sports news, sports, cricket news, cricket

India were bundled out for 135 with Vernon Philander returning career-best figures of 6/42, as the visitors hurtled to a 72-run defeat against South Africa on Day 4 of the first Test in Cape Town.

విరాట్ సేనను కుప్పకూల్చిన ఫిలాండర్..

Posted: 01/08/2018 09:07 PM IST
India vs south africa 1st test south africa beat india by 72 runs to take 1 0 lead

దక్షిణాఫ్రికాను రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా స్వల్ప విజయలక్ష్యం చేధించడంలో విఫలమైంది. సఫారీల బౌలింగ్ ఎదుర్కొండంలో పూర్తిగా చేతులెత్తేసిన విరాట్ సేన అత్యల్ప స్కోరుకే చాపచుట్టేయడంతో దక్షిణాఫ్రికా తొలి టెస్టులో 72 పరుగలతో విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో తమ సత్తాను చాటినా..  బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాట్స్ మెన్ మాత్రం అంతగా రాణించలేదు. ఇక టీమిండియాపై తన బౌలింగ్ ప్రతాపాన్ని చూపిన సఫారీలకు చెందిన ఫిలాండర్ తన కెరీర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ గణంకాలను నమోదు చేసుకున్నాడు.

విరాట్ సేనను కుప్పకూల్చడంలో కీలక భూమిక పోషించిన ఫిలాండర్ ఏకంగా అరు వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు. టీమిండియా బౌల‌ర్లు అద్భుతంగా రాణించిన‌ప్ప‌టికీ బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం రాణించ‌లేక‌పోవ‌డంతో.. ద‌క్షిణాఫ్రికా విజ‌య దుందుభి మోగించింది. మొదటి ఇన్నింగ్స్ లో ద‌క్షిణాఫ్రికా 286 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులు చేసిన విష‌యం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 209 పరుగులు చేసిన నేపథ్యంలో విజయానికి 208 పరుగులు మాత్ర‌మే చేయాల్సి ఉండ‌గా ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల ధాటికి వ‌రుస‌గా భార‌త బ్యాట్స్‌మెన్ ఔట‌య్యారు.

భార‌త బ్యాట్స్‌మెన్‌లో మురళీ విజయ్ 13, శిఖర్ ధావన్ 16, పుజారా 4, విరాట్ కోహ్లీ 28, రోహిత్ శర్మ 10, వృద్ధిమాన్ సాహా 8, హార్దిక్ పాండ్యా 1, రవి చంద్రన్ అశ్విన్ 37, భువనేశ్వర్ కుమార్ 13 (నాటౌట్) , షమీ 4, బుమ్రా 0 పరుగులు మాత్రమే చేశారు. దీంతో టీమిండియా 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలండర్ 6 వికెట్లు తీయగా, మార్కెల్, రబడా రెండేసి వికెట్లు తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles