india clinches T20 series from sri lanka టీ20 సిరీస్ టీమిండియాదే.. ఇండోర్ మ్యాచూ మనదే

India beat sri lanka to take an unassailable 2 0 lead

India vs Sri Lanka, T20I, MS Dhoni, ind vs sl, yuzvendra chahal, Virat Kohli, Rohit Sharma, BCCI, 1st T20I, Rohit Sharma, India, MS Dhoni, kuldeep yadav, hardik pandya, INDvSL, sports news, sports, cricket news, cricket

Kuldeep Yadav and Yuzvendra Chahal took 7 wickets between them as India beat Sri Lanka by 88 runs to take an unassailable 2-0 lead at Holkar Cricket Stadium

టీ20 సిరీస్ టీమిండియాదే.. ఇండోర్ మ్యాచూ మనదే

Posted: 12/22/2017 10:18 PM IST
India beat sri lanka to take an unassailable 2 0 lead

శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్‌ల విజయ పరంపరను భారత్ టీ-20 సిరీస్‌లోనూ కొనసాగించింది. శుక్రవారం హోల్కార్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ-20లో భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 260 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో రోహిత్(118), రాహుల్(89), ధోని(28) పరుగులు చేశారు.

కాగా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టును గెలిపించేందుకు లంక బ్యాట్స్‌మెన్లు కుషల్ పెరీరా(77), తరంగా(47) తీవ్రస్థాయిలో కృషి చేశారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 109 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. కాగా 145 పరుగుల వద్ద తరంగా ఔట్ అయ్యాక లంక బ్యాట్స్‌మెన్లు ఎవరూ పెద్దగా క్రీజ్‌లో నిలబడలేకపోయారు. భారత స్పిన్నర్ల ధాటికి ఒక్కొక్కరిగా కుప్పకూలిపోయారు.

దీంతో శ్రీలంక 17.2 ఓవర్లలో 172 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది. కాగా లంక సీనియర్ ఆటగాడు అంజిలో మాథ్యూస్ గాయం కారణంగా బ్యాటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో శ్రీలంక జట్టును ఆలౌట్‌గా డిక్లేర్ చేశారు. భారత బౌలింగ్‌లో చహాల్ 4, కుల్దీప్ 3, హార్థిక్, ఉనద్కట్ చెరో వికెట్ తీశారు. దీంతో రెండో టీ-20ని 88 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. టీ-20 సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  T20I  MS Dhoni  ind vs sl  rohit sharma  Thisara Perera  cricket  

Other Articles