Rohit Sharma slams MS Dhoni critics రవిశ్రాస్త్రీ తరువాత రోహిత్.. విమర్శలను తిప్పికోట్టారు.

M s dhoni at 36 can beat players of 26 ravi shastri slams critics

Rohit Sharma, Ravi Shastri, Virat Kohli, Team India, MS Dhoni, India cricket, India vs Sri Lanka, India vs South Africa, India tour of South Africa, Test cricket, ODI cricket, Stand-in captain, Cricket, sports news,sports, latest sports news, cricket news, cricket

After Ravi Shastri, Rohit Sharma said the criticism around MS Dhoni was unfair as he faces a lot less deliveries than the other batsmen in the team.

రవిశ్రాస్త్రీ తరువాత రోహిత్.. అతనిపై విమర్శలను తిప్పికోట్టారు.

Posted: 12/26/2017 05:13 PM IST
M s dhoni at 36 can beat players of 26 ravi shastri slams critics

ఆది నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలుస్తూ విమర్శలను ఎక్కడికక్కడ ఖండిస్తూ ధీటుగా సమాధానమిస్తూ.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి అండగా నిలబడగా, గత కొంతకాలం నుంచి జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రీ కూడా సపోర్టివ్ గా నిలబడ్డాడు. ఇక తాజాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ధోనికి అండగా నిలబడి విమర్శకులకు సమాధానమిస్తున్నాడు. జాతీయ మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. ధోని చుట్టూ అలుముకున్న విమర్శలను అయన తీవ్రంగా ఖండించాడు.,

టీ20 ఫార్మెట్ లో యువ క్రికెటర్లకు స్థానం కల్పించి వారిని ధీటైన క్రికెటర్లుగా మలుస్తున్నామని.. ఈ నేపథ్యంలో మ్యాచ్ గెలుపోటములను పట్టించుకోవడం లేదన్న జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రీ వ్యాఖ్యలపై నెట్ జనులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆయనపై విమర్శలను ఎక్కుపెడుతూ.. ఇక చాన్స్ దొరికింది కదా అని వెంటనే మరి ధోనికి టీ20లలో స్థానం ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై సమాధానమిచ్చిన రోహిత్ ధోని అరో స్థానంలో బ్యాటింగ్ దిగే సమయానికి మ్యాచ్ గెలుపోటములు నిర్ధేషించే సమయం వచ్చేస్తుందని, అ సమయంలో ఆయన మిగతా క్రికెటర్ల కంటే తక్కు వ బంతులను ఎదుర్కొంటాడని చెప్పాడు. ఆ సమయంలో మ్యాచ్ పరిస్థితి ఎలా వుందన్న విషయాన్ని విమర్శకులు అర్థం చేసుకోవాలని అంతేకాని ధోని పరుగులు చేయలేదంటూ విమర్శలు చేయడం సరికాదని అన్నాడు.

అంతకుముందు ధోని 36 ఏళ్ల వయసులో కూడా అద్భుత ప్రతిభతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడని తన కన్నా పదేళ్ల చిన్నవారైన క్రికెటర్లతో పోటీ పడినా ధోని వారికన్నా వేగంగా పరుగెత్తగలడు... పూర్తి ఫిట్ గా వున్నాడని జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నారు. "మేమేం పిచ్చోళ్లం కాదు. గత 30 నుంచి 40 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నా. కోహ్లీ కేవలం పదేళ్ల నుంచే క్రికెట్ లో ఉన్నాడు. 26 ఏళ్ల వయసున్న ఆటగాడిని కూడా ధోనీ చిత్తు చేయగలడు.

 విమర్శలు గుప్పిస్తున్న వారికి ఒకటే సూచన చేస్తున్నా. 36 ఏళ్ల వయసులో వారు ఎంత వరకు క్రికెట్ ఆడగలిగారు? ఒక రెండు పరుగులైనా వేగంగా పరుగెత్తగలిగారా? మీరు రెండు రన్స్ చేసే లోపు, ధోనీ మూడు పరుగులు చేయగలడు. ప్రస్తుత క్రికెట్ లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అత్యున్నత క్రికెటర్లలో ధోనీ ఒక్కడు. ధోనీలో ఉన్న గొప్ప లక్షణాలు మార్కెట్ లో దొరికేవి కావు. మీరు వాటిని ఎక్కడా కొనలేరు. పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఆపేయండి" అంటూ శాస్త్రి విమర్శకులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Ind vs SL  Rohit Sharma  Ravi Shastri  MS Dhoni  cricket  

Other Articles