middle order made team defeat thisara perera దారుణ ఓటమిపై లంక కెప్టెన్ ఏమన్నాడంటే..

Middle order wickets loss made team defeat thisara perera

India vs Sri Lanka, T20I, MS Dhoni, ind vs sl, Thisara Perera, yuzvendra chahal, Rohit Sharma, Cuttack, BCCI, 1st T20I, Rohit Sharma, India, MS Dhoni, kuldeep yadav, barabati stadium, cuttack, hardik pandya, INDvSL, sports news, sports, cricket news, cricket

Sri Lanka couldn't get it going from the beginning. Neither the openers, nor the middle-order batsmen showed attributes of putting up a fight. On a two-paced wicket, India bowlers dropped their pace and the batsmen struggled

దారుణ ఓటమిపై లంక కెప్టెన్ ఏమన్నాడంటే..

Posted: 12/21/2017 07:31 PM IST
Middle order wickets loss made team defeat thisara perera

కటక్‌ వేదికగా బారాబాతి స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడు మ్యాచుల టీ20 సిరీస్లో 1-0తో అధిక్యంలో వుంది. అయితే ఇంతటి దారుణ ఓటమికి కారణం మాత్రం లంక బ్యాట్స్ మెన్లు క్రమంగా వికెట్లు కోల్పోవడమేనని విశ్లేషకులు ఇప్పటికే చెప్పారు. కాగా శ్రీలంక కెప్టెన్ థిసార పెరీరా కూడా  మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ అదే విషయాన్ని చెప్పాడు.

టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్ ఆహ్వానించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నాడు. భారత్ బ్యాట్స్‌మెన్ చక్కగా ఆడారని, కఠిన పరిస్థితుల్లోనూ భారత స్పిన్నర్లు బ్రహ్మాండగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. 160-170 పరుగులను ఛేదించడం కష్టమైన పనేమీ కాదని, ఆరంభం బాగుండి ఉంటే 180 పరుగులను కూడా ఛేదించగలిగి ఉండేవారమని పెరీరా పేర్కొన్నాడు.

తమ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మరింత బాగా ఆడాల్సి ఉందని, తమ ఓటమికి బ్యాట్స్‌మెన్ వైఫల్యమే కారణమని పేర్కొన్నాడు. ఈ ఓటమి తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. ప్రాక్టీస్ సెషన్లలో బాగా కష్టపడ్డామన్నాడు. వచ్చే మ్యాచ్‌లో మరింత బాగా ఆడేందుకు ప్రయత్నిస్తామని పెరీరా వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  T20I  MS Dhoni  ind vs sl  yuzvendra chahal  Thisara Perera  Srilanka  cricket  

Other Articles