Pakistan players to return from Afro T20 League ఆఫ్రో టీ20 కప్ లో పాకిస్తాన్ క్రికెటర్లకు చుక్కలు..

Top pakistani cricketers stuck in uganda after payment dispute

Afro T20 League, Yasir Hameed, uganda cricket association, Saeed Ajmal, Pakistan Cricket Board, Kampala, cricket, sports news, cricket news, latest cricket news, latest sports news, latest news

Nearly 20 Pakistani cricketers had gone to Kampala, Uganda to play in a T20 league after taking due permission from PCB have been left stranded over payment dispute

ఆఫ్రో టీ20 కప్ లో పాకిస్తాన్ క్రికెటర్లకు చుక్కలు..

Posted: 12/22/2017 06:54 PM IST
Top pakistani cricketers stuck in uganda after payment dispute

టీ20 లీగ్ లో ఆడేందుకు ఆఫ్రికా దేశం ఉగాండాకు వెళ్లిన పాకిస్థాన్ క్రికెటర్లకు చుక్కలు కనిపించాయి. వివరాల్లోకి వెళ్తే, ఆఫ్రో టీ20 కప్ లో ఆడేందుకు పాక్ క్రికెట్ బోర్డుతో ఉగాండా క్రికెట్ బోర్డు ఒప్పందం చేసుకుంది. దీనికి ఐసీసీ గుర్తింపు కూడా ఉంది. ఇందులో భాగంగా టోర్నీలో పాల్గొనేందుకు పాక్ కు చెందిన 20 మంది టాప్ క్రికెటర్లు ఉగాండా చేరుకున్నారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత కానీ, వారికి తెలియలేదు, లీగ్ ను రద్దు చేశారని!

అంతేకాదు, కాంట్రాక్ట్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ఆర్గనైజర్లు చెల్లించలేదు. చివరి నిమిషంలో లీగ్ స్పాన్సర్ తప్పుకోవడంతో అక్కడి బోర్డు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో, మీకు కాంట్రాక్టు డబ్బులు కూడా చెల్లించలేమంటూ చేతులు ఎత్తేసింది. లీగ్ ఆర్గనైజర్లు డబ్బులు చెల్లించకపోవడంతో విమాన సంస్థ టికెట్లను కూడా రద్దు చేసింది. దీంతో, పాక్ ఎంబసీ, పీసీబీ సహకారంతో వీరంతా పాక్ కు తిరిగి చేరుకున్నారు. మరోవైపు, ఈ ఘటనపై పాక్ క్రికెట్ బోర్డు సీరియస్ అయింది. విచారణకు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles