Chahal Becomes Highest T20I Wicket-taker in 2017 టీ20 మ్యాచుల్లో చాహల్ సరికొత్త రికార్డు..

Yuzvendra chahal becomes highest t20i wicket taker in 2017

India vs Sri Lanka, T20I, MS Dhoni, ind vs sl, yuzvendra chahal, rashid khan, cresic williams, Virat Kohli, Rohit Sharma, Cuttack, BCCI, 1st T20I, Rohit Sharma, India, MS Dhoni, kuldeep yadav, barabati stadium, cuttack, hardik pandya, INDvSL, sports news, sports, cricket news, cricket

Yuzvendra Chahal became the highest wicket-taker in T20Is of 2017 calender year with 19 wickets in account. He recorded figures of 4/23 against Sri Lanka in the first T20I at cuttack followed by rashid khan and cresic williams

టీ20 మ్యాచుల్లో చాహల్ సరికొత్త రికార్డు..

Posted: 12/21/2017 12:38 PM IST
Yuzvendra chahal becomes highest t20i wicket taker in 2017

హరియాణవాసి యుజ్వేంద్ర చాహల్ ఐసీసీ టీ20లలో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియా పరమిత ఓవర్ల క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న ఈ కుడిచేతి వాటం గల ఈ లెగ్ స్పిన్నర్ ఈ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన వాడిగా రికార్డులకెక్కాడు. కటక్ వేదికగా బారబతి స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో పర్యాటక జట్టు శ్రీలంకకు చెందిన నాలుగు  వికెట్లు పడగొట్టి ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు చాహల్.

2017లో మొత్తం 10 మ్యాచులు ఆడిన చాహల్ ఇప్పటి వరకు మొత్తం 19 వికెట్లు నేలకూల్చాడు. తొలి టీ 20లో ఉపుల్ తరంగా, ఏంజెలో మాథ్యూస్‌, అసేలా గుణరత్నే, దాసున్ షనక వికెట్లను తీసిన చాహల్‌ ఈ ఘనతను సాధించాడు. ఇక ఈ ఏడాదిలో మరో రెండు టీ 20 మ్యాచులు అడనున్న చాహల్.. మరిన్ని వికెట్లను తన ఖాతాలో వేసుకునే అవకాశం కూడా వుంది. దీంతో చాహల్ ఈ క్యాలెండర్ ఇయర్ టీ20 అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డును సాధించాడు.

టీ20లలో ఇన్ని వికెట్లు తీసిన బౌలర్ చాహల్ ఒక్కడే. అతడి తర్వాతి స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, విండీస్ పేసర్ క్రెసిక్ విలియమ్స్‌లు 17 వికెట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. శ్రీలంకతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండడంతో ఈ ఏడాది పొట్టి  క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా చాహల్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  T20I  MS Dhoni  ind vs sl  yuzvendra chahal  rashid khan  cresic williams  cricket  

Other Articles