MS Dhoni on the cusp of a landmark మరో రికార్డును అందుకున్న ధోని, రోహిత్

Rohit dhoni on the cusp of a landmark heading into the t20i series

Rohit Sharma, India, MS Dhoni, mile stones, 73 catches, 1500 runs, News, INDvSL, sports news, sports, cricket news, cricket, today match, today match score, today match updates

Barabati Stadium in Cuttack could turn out to be a special one for the two most experienced players in the Indian side, skipper Rohit Sharma and MS Dhoni.

ధోని, రోహిత్ శర్మల అరుదైన ఘనత

Posted: 12/20/2017 10:41 PM IST
Rohit dhoni on the cusp of a landmark heading into the t20i series

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లంకతో వన్డే, టీ20 సిరీస్ కు దూరంగా వున్న తరుణంలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జట్టు వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ సహా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సైతం మరో అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటికే వన్డేలలో మూడు డబుల్ శతకాలను సాధించి తన పేరున అరుదైన రికార్డును నెలకోల్పిన రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును అందుకుని ఏకంగా పరుగుల యంత్రం పక్కన స్థానం సంపాదించాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే టీమిండియా అటగాళ్లలో టీ20 మ్యాచుల్లో 1500 పరుగులను సాధించగా.. రోహిత్ శర్మ ఇవాళ్టి మ్యాచ్ లో 17 పరుగులను మాత్రమే సాధించినా.. అంతకుముందు 15 పరుగులను సాధించడంతో 1500 పరుగుల క్లబ్ లోకి చేరిపోయాడు. దీంతో టీమిండియా తరపున ఈ క్లబ్ లో చేరిన రెండో భారతీయ క్రికెటర్ గా అవతరించాడు. ఇందుకు గాను కటక్ లోని బారబతి స్టేడియం వేదికగా నిలిచింది.

ఇక ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ధోని కూడా మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన వికెట్ కీపర్ లేదా ఫీల్డర్‌గా మహేంద్ర సింగ్ ధోని అవతరించాడు. ఈ మ్యాచ్ కు ముందు కేవలం రెండు వికెట్లు మాత్రమే ఈ ఫీటును సాధించేందుకు అవసముండేది. అయితే రెండు వికెట్లతో ఈ ఫీటును అందుకున్న క్రికెటర్ గా ధోని అవతరించాడు.

కాగా మూడు వికెట్లు తీయడంతో అత్యధిక వికెట్లు తీసిన కీపర్ కమ్ పీల్డర్ గా ధోని అరుదైన ఘనతను అందకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట 72 వికెట్లతో వుండగా, ఇవాళ మూడు వికెట్లను పడగొట్టి రికార్డును బద్దలుకోట్టి తన పేరున లిఖించుకున్నాడు మన మిస్టర్ కూల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  India  MS Dhoni  News  INDvSL  mile stones  73 catches  1500 runs  sports news  cricket  

Other Articles