Ajinkya Rahane’s father arrested టీమిండియా క్రికెటర్ తండ్రి అరెస్టు..!

Ajinkya rahane s father arrested after car mows down woman

Ajinkya Rahane, rahane car accident, rahane father, Rahane, Madhukar Rahane, madhukar baburao rahane, Ajinkya Rahane Father, ajinkya rahane, father, Madhukar Baburao Rahane, rahane father arrest, accident, Kolhapur, cricket, crime

India cricketer Ajinkya Rahane’s father Madhukar Baburao Rahane has been arrested, for running down a 67-year-old woman in Kolhapur.

టీమిండియా క్రికెటర్ తండ్రి అరెస్టు..!

Posted: 12/15/2017 06:10 PM IST
Ajinkya rahane s father arrested after car mows down woman

టీమిండియా క్రికెటర్ అజింక్య రహానె టైం అసలు బాగోలేదన్నట్లు తెలుస్తుంది. శ్రీలంకతో జరిగిన రెండు వన్డే మ్యాచుల్లో తనకు తుది జట్టులో స్థానం లభించకపోవడంతో కాసింత అసహనంతో వున్న రహానేకు అయన తండ్రి విషయం మరింత అందోళనకు గురిచేసింది. అజింక్య రహానే తండ్రి మధుకర్ బాబురావ్ రహానెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అకస్మాత్తుగా రొడ్డుపైకి వచ్చిన ఓ మహిళా పాదచారిని ప్రమాదవశాత్తు కారుతో ఢికొట్టడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తీవ్రంగా గాయాలపాలై మహిళా పాదచారిని స్థానికులు వెంటనే అసుపత్రికి తరలించారు. కాగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మరణించిన మహిళా పాదచారి అషటై కంబల్ గా గుర్తించిన పోలీసులు.. ఈ ప్రమాదానికి కారణమైన రహానె తండ్రి మధుకర్ బాబురావ్ రహానెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారని సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో మధుకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హ్యుందై ఐ20 కారులో నాలుగో నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా మహిళా పాదచారిని రోడ్డుపైకి రావడంతో అమెను చివరిక్షణంలో గమనించిన ఆయన బ్రేకులు వేసేప్పటికే మహిళను ఢీకొట్టారు. కన్ గల్ ప్రాంతంలో కంబల్ ను కారుతో ఢీకొట్టారు. ప్రమాద స్థలం వద్ద గుమిగూడిన స్థానికులు గాయపడ్డ కంబల్ ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అమె మరణించింది. ఐపీఎసీ 304ఏ, 337, 338, 279, 184 ప్రకారం మధుకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajinkya rahane  father  Madhukar Baburao Rahane  rahane father arrest  accident  Kolhapur  cricket  crime  

Other Articles