పాకిస్థాన్ మాజీ డ్యాషింగ్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమణ పోందినా.. తనలో సత్తా మాత్రం తగ్గలేదని అంటున్నాడు. ఇన్నాళ్లు ఇదే విషయం చెప్పిన ఆయన తాజాగా జరుగుతున్న లీగ్ లో నిరూపించాడు. ఇక ఆయన బ్యాటు నుంచి పరుగుల వరద జాలువరుతుందేమోనని అభిమానులు ఎదురుచూసినా.. అది నెరవేరేలా లేదు.. అయితే తన చేతితో మాత్రం జాదూ వుందని అంటున్నారు. అదెలా అంటే ఆయన చేతి నుంచి విసిరిన బంతులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వరుస వికెట్లను తన ఖాతా వేసుకున్నాడు.
అదేంటి వరుస వికెట్లను తన ఖాతాలో వేసి.. నూతనంగా ప్రారంభమైన టీ10 లీగ్ లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో వేసిన తొలి ఓవర్ మూడు బంతులకు మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ నమోదు చేశాడు. పక్తూన్స్ జట్టు తరపున ఆడుతున్న ఆఫ్రిది తాను వేసిన తొలి ఓవర్‌లోనే అద్భుతం చేశాడు. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఔటైన ముగ్గురిలో ఒకరు మరాఠా అరేబియన్స్ కెప్టెన్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ ఉండడం.
తొలి బంతికి సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ రిలీ రోసౌను ఔట్ చేసిన ఆఫ్రిది, రెండో బంతికి డ్వాన్ బ్రావోను పెవిలియన్ పంపాడు. మూడో బంతికి సెహ్వాగ్ ను ఔట్ చేశాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఫఖ్తూన్స్ జట్టు పది ఓవర్లలో 121 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ 22 బంతుల్లో అజేయగా 45 పరుగులు చేశాడు. 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మరాఠా అరేబియన్స్ జట్టు 25 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ 26 బంతుల్లో 57 పరుగులు చేసినా జట్టును పరాజయం నుంచి కాపాడలేకపోయాడు.
(And get your daily news straight to your inbox)
May 27 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. అయినా తాను ప్రతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. శిఖర్ ధావన్... Read more
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more
Apr 27 | రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి... Read more
Apr 13 | ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి... Read more
Apr 13 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్... Read more