Pakistani bowlers shower love on Kohli! విరాట్ కోహ్లీపై దాయాధి పేసర్ల ప్రశంసలు

Special praise for virat kohli from two pakistani fast bowlers

India vs New Zealand, 2017, Indian Cricket, Pakistan Cricket, Virat Kohli, Shoaib Akhtar, mohammad irfan, cricket news, sports news, Team India, cricket

Pacer Bhuvneshwar Kumar is reportedly set to tie the knot with his fiancee Nupur Nagar on November 23. It will be followed by two reception dinners on the November 26 and 30 in Bulandshahr and Delhi respectively.

విరాట్ కోహ్లీపై దాయాధి పేసర్ల ప్రశంసలు

Posted: 11/11/2017 09:06 PM IST
Special praise for virat kohli from two pakistani fast bowlers

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తూ మైమరచిపోయే అభియానులు అనేకం. దేశ విదేశాలలో టీమిండియా పరుగుల మిషెన్ కు అభిమానులకు కొదవలేదు. మరీ ముఖ్యంగా దాయాధి దేశంలో విరాట్ పై అభిమానంతో జైలుపాలైన క్రికెట్ అభిమానులు కూడా వున్నారు. సాధారణ అభిమానులే కాదు ఏకంగా క్రికెటర్లు కూడా కోహీకి అభిమానులవుతున్నారంటే అందుకు అతని అద్భుతమైన ప్రతిభే కారణం. ఇలా ‘ఫిదా’ అయిన వారు చాలా మందే ఉన్నారు. అందులో పాకిస్థాన్‌ బౌలర్లు మహ్మద్‌ ఇర్ఫాన్‌, షోయబ్‌ అక్తర్‌ కూడా ఉండడం విశేషం.

అంతేకాదు కోహ్లీ బ్యాటింగ్‌పై వారు ప్రశంసల జల్లు కురిపించారు కూడా. కోహ్లీ ఇటీవల మహ్మద్‌ ఇర్ఫాన్‌ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని, అందుకు ఆయన ఎత్తే కారణమని అన్నాడు. అక్తర్‌ బౌలింగ్ లో తాను ఎప్పుడూ ఆడనప్పటికీ కోహ్లీ అక్తర్‌ గురించి కూడా మాట్లాడాడు. ‘దంబుల్లాలో జరిగిన ఓ మ్యాచ్ లో అక్తర్ ను చూశానని. అతడు చాలా ప్రమాదకారి. ఒకవేళ అతడు వేసిన బంతి బ్యాట్స్ మెన్ కు తగిలితే ఏమౌతుందా?’ అని ఆలోచించా అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

దీనిపై ఈ ఇద్దరు పాకిస్థానీ బౌలర్లు తాజాగా స్పందించారు. కోహ్లీ బ్యాటింగ్‌ శైలిపై ప్రశంసల వర్షం కురిపించారు. గొప్ప మనసున్న ఆటగాడు అని, మైదానంలో మరిన్ని మ్యాచ్ లు కలిసి ఆడుదామని ఆశిస్తున్నానని ఇర్ఫాన్‌ ట్వీట్‌ చేశారు. ఇక అక్తర్‌ అయితే ఏకంగా.. కోహ్లీ బ్యాటింగ్ లో ఉన్నప్పుడు తాను బౌలింగ్ చేయకపోవడమే మంచిది అని ట్వీట్ చేశాడు. కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్ అని, అతడికి బౌలింగ్ చేయడం పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు.

క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న కోహ్లీని టీవీల్లో చూసి మురిసిపోయేవారితో పాటు సామాజిక మాధ్యమాల్లో అనుసరించేవారూ లక్షల్లో ఉన్నారు. కోహ్లీ ట్విటర్‌ ఖాతాను సుమారు రెండు కోట్ల మంది అనుసరిస్తుండగా.. ఇన్‌స్టాగ్రాంలో 1.5 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఫేస్‌బుక్‌లో అయితే ఏకంగా 3.6 కోట్ల మంది లైక్‌ చేయడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  Shoaib Akhtar  mohammad irfan  pakistan  pacers  indian cricket team  bcci  cricket  

Other Articles